Blog

06 Jun
0

Hindu marriage tradition – the real meaning of kanyadana

Information: Someone sent me a question regarding Hindu marriage tradition – I thought the answer would be useful to all of you.

Question: After donating the bride (kanyadanam) do parents have any rights and responsibilities towards the girl?! are parents expected to wash off their hands completely after kanyadanam?! Also what advise is there in our scriptures for a happy married life?”

wedding

Answer:

In HIndu marriage tradition “kanyaadanam” is misunderstood as “donating a bride”. I heard some priests give out a wrong meaning to the word. They wrongly interpret it as “kanya (girl) + daana (donation)”.

Kanyadana really means taking / receiving / bringing a bride to home. (आदान = receiving)).आदान [Monier Williams Sanskrit English Dicionary) [L=23783] receiving , taking for one’s self , drawing near to one’s self Ragh. iv , 86In Hindu vivaaha (marriage) the groom sends out a search party to find a suitable bride. He conveys through the priest that for his sake he wants to choose a bride (madardham kanyaam vruneemahe) – this particular usage of word “Vruneemahe” conveys a very reverential meaning. It means he wants to choose a wife with love and respect. A wife who he could treat properly. In our Veda where ever the word “Vruneemahe” is used it is always invoked with respect and reverence. For example see below verse from Rigveda where the invocation says “hotaaram tva vruneemahe”.agne vishvebhir A gahi devebhir havyadAtaye | hotAraM tvAvRuNeemahe || (Rigveda 5.026.04) O Agni, come with all the Gods, come to our sacrificial gift: We choose thee as Invoking Priest.

Hence kanyadana does not mean “donating a bride” it rather means ‘the groom is choosing a bride’. Also the groom further gives an explanation why he is choosing a bride. He says that he is choosing a bride “so that he can make the Gods feel happy, so that he can make the society feel happy, so that he can make the bride feel happy, so that he can beget children lawfully (dharma praja).” Interestingly, it appears like there is no personal happiness in such an act (of chosing a bride) for him, at least there is no such thing mentioned in the wedding hymns. It is seen as by getting married the man is fulfilling his grihasta dharma.

Though It is true that bride’s parents do give the bride into the hands of groom, they still hold life-long parental bond and parental responsibility towards the bride. It is understood that they are giving their daughter into the hands of an able groom who promised them – ‘that he will fulfil his moral obligation towards her as a husband (dharma); that he will provide her financial security (artha); that he will have conjugal relations with her (kama). Therefore it is the responsibility of the husband to make sure that his wife is reasonably happy in his company’.

Hindu marriage is seen as two souls come together in union of love. Both bride and groom are two consenting adults. But the husband has to keep up to his promises. Therefore he has to look after her well, he also should fulfill the wedding promises he made to her parents and also to her!

In Ramayana we all know the story of Kikeyi. She is the wife of Lord Dasaratha. She asked her husband a boon. She wanted to send away Lord Rama to forrests. Lord Dasaratha obliged that. This sounds absurd. Why can’t Lord Dasaratha simply overrule his wife?! Sure he can do such a simple thing. Why did he send Lord Rama to forrest when he knows that his wife is asking of him a wrong thing!? Though he chose to disagree with her, plead with her, he obeyed his promise to her. He sent away Lord Rama to forrests! Dasaradha did that because he is honouring his conjugal responsibilities. Same is the case with Seeta. Lord Rama knew how absurd it is to find a golden deer in the forrest, yet when Sita wanted to capture such a deer he obliged! I mentioned these two instances as an example to convey you how how Hindu marriage custom was set. It is plain and simple “A good husband must Honour his wife’s wishes”

आत्मा हि दाराः सर्वेषाम् दारसम्ग्रहवर्तिनाम् | A wife is very self to all, who constantly care for their wives. [Vaalmiki Ramayana 2-37-24]

Valmiki Ramayana contains pearls of wisdom towards marriage. Seeta was about to follow her her husband into the forrest. She goes to seek the blessings of her mother-in-law Kausalya. And the words of wisdom Kausalya offers are memorable:

ताम् भुजाभ्याम् परिष्वज्य श्वश्रूर् वचनम् अब्रवीत् |
अनाचरन्तीम् कृपणम् मूध्नि उपाघ्राय मैथिलीम् || २-३९-१९
असत्यः सर्व लोके अस्मिन् सततम् सत्कृताः प्रियैः |
भर्तारम् न अनुमन्यन्ते विनिपात गतम् स्त्रियः || २-३९-२०
एष स्वभावो नारीणामनुभूय पुरा सुखम् |
अल्पामप्यापदम् प्राप्य दुष्यन्ति प्रजहत्यपि || २-३९-२१
असत्यशीला विकृता दुर्र्गाह्याहृदयास्तथा |
युवत्यः पापसम्कल्पाः क्षणमात्राद्विरागिणः || २-३९-२२
न कुलम् न कृतम् विद्या न दत्तम् नापि सम्ग्रहः |
स्त्रीणाम् गृह्णाति हृदयमनित्यहृदया हि ताः || २-३९-२३
साध्वीनाम् हि स्थितानाम् तु शीले सत्ये श्रुते शमे |
स्त्रीणाम् पवित्रम् परमम् पतिरेको विशिष्यते || २-३९-२४

tAm BujAByAm pariShvajya SvaSrUr vacanam abravIt |
anAcarantIm kRupaNam mUdhni upAGrAya maithilIm || 2-39-19
asatyaH sarva loke asmin satatam satkRutAH priyaiH |
BartAram na anumanyante vinipAta gatam striyaH || 2-39-20
eSha svaBAvo nArINAmanuBUya purA suKam |
alpAmapyApadam prApya duShyanti prajahatyapi || 2-39-21
asatyaSIlA vikRutA durrgAhyAhRudayAstathA |
yuvatyaH pApasamkalpAH kShaNamAtrAdvirAgiNaH || 2-39-22
na kulam na kRutam vidyA na dattam nApi samgrahaH |
strINAm gRuhNAti hRudayamanityahRudayA hi tAH || 2-39-23
sAdhvInAm hi sthitAnAm tu SIle satye Srute Same |
strINAm pavitram paramam patireko viSiShyate || 2-39-24

[Valmiki Ramayana 2-39-19:24]

Meaning:
Embracing in her arms that princess of Mithila (Sita), who never behaved in self-pity, and smelling her head(as a token of affection), her mother-in-law(Kausalya) spoke as follows:(19)

“Dishonest women, eventhough adored all the time by their husbands, cease to esteem their husband who has come to pass into evil days, throughout this world.”(20) “Having enjoyed happiness in the past, they become spoiled and even desert their husband, on obtaining even the least misfortune: such is the nature of (bad) women.”(21) “Young women, who are evil-minded, are untruthful in their disposition, are affected by passion and their essence, incomprehensible. They get aversion within a moment.” (22) Neither a noble descent, nor an accomplishment, nor learning, nor a gift nor even entertainment can capture the heart of women. They are unstable of their heart indeed!” (23) “But, for women established in good conduct, truthfulness, sacred learning and mental quietness, their husband alone is the most sacred entity, the best of all.” (24)

So you can see from the above pearls of wisdom that “for women established in good conduct, truthfulness, sacred learning and mental quietness, their husband alone is the most sacred entity, the best of all.”

Only – in-spite of her genuine efforts, when a housewife finds herself in a situation where she is not happy in her married life then she has every right to do what she wishes! There is scriptural permission for her to do so! She also has every right to break such an unhappy marriage. She can walk away! For example in Vishnu Purana we find a story of Lord Vishnu and Goddess Lakshmi. Following a spat with Lord Vishnu, Goddess Lakshmi left her heavenly abode and came down to the earth. She walked away from him and settled down in Alimelumangapuram. This is the story of Lord Balaji of Tirupati. Lord Vishnu came down in search of his wife and settled down as Lord Balaji in Tirupati.

As far as I understand, in Hindu tradition a man can not break his marriage no matter how ever much he wishes to do so, but a woman can break her marriage and walk away. A man has to obey the wish of the lady and let her go free! He may try to persuade her but he can’t force her!

In Hindu marriage a wife can make or break the marriage. So it is the parents responsibility to educate their daughter towards noble qualities. It is the parents responsibility to teach their son how to be a good husband. It is the responsibility of the wife and husband to live with each other in mutual love and respect.

Such a marriage based on the understanding of our tradition never breaks! But the moderen day living devoid of understanding our scriptures is causing a lot of marital distress. The only way out of this predicament is for the couple to start understanding our Hindu scriptures and traditions. Especially all hindus must read Valmeeki Ramayana and Vyaasa Mahabharata and get proper understanding on our ancient Hindu life and culture.

Om tat sat

-Madhava Turumella, London, UK 21/11/2013 email: madhava@madhava.net

Read More
06 Jun
0

సమాజసేవపై ఒక సలహా

సమాజసేవపై ఒక సలహా:-

కర్ణుడు పుట్టగానే కవచకుండలాలతో ఎందుకు పుట్టాడా అని ప్రశ్నించుకుంటే అతడి జీవితంలో అతడు అనేక బాధలు పడ్డాడు.  ఎక్కడోపుట్టి ఎక్కడో పెరిగాడు. దాతృత్వంలో మొనగాడైనా, అరివీరభయంకరుడైనా, అతిగొప్పశూరుడైనా అతడు శాపగ్రస్తుడు.  ఈ విషయం అతడికిగూడా తెలుసు.  అనేకులు అతడిని తమ తమ అవసరాలకు వాడుకున్నారు.  చివరకి శాపాలనే వరంగా ఇచ్చివెళ్లారు.  అందరూ అతడిగురించి గుసగుసగా అవమానిస్తూ మాట్లాడుకునే మాటలు అతని చెవిన పడకుండా ఉండాలని కుండలాలు, అందరూ అతడివైపు సరాసరి విసిరే  బాణాలు అతనికి తగలకుండా ఉండాలని కవచము ఇచ్చి అతడిని ఈ దుష్టప్రపంచంనుండి కాపాడాలని అతడి తండ్రిసూర్యుడు చేసిందంతా ఒక వృధా ప్రయత్నంగా మారింది ! ఎందుకంటే లోకానికి ఉపకారం చేద్దామనుకునే మత్తుమందుకు బానిస అయినవాడు కర్ణుడు.  ఆడిగినవానికి లేదనకుండా ఇచ్చేవాడు.

నిజానికి  కర్ణుడికి కవచం ఉన్నట్లే భారతదేశం రాజకీయాలలో ఉండాలంటే ఖడ్గమృగంలాంటి అతి బలమైన చర్మం నీకు కవచంగా ఉండాలి.  దీన్నే ఇంగ్లీషులో Having a thick skin అంటారు. నీవు కర్ణుడిలాగా మంచి చెయ్యబోతే నీచేష్టలవెనుక ఏ మర్మం దాగిఉందా అని వెదుకుతుంది సమాజం.  నీవు కర్ణుడిలాగా ఒకరికి మంచిచెయ్యబోతే నీకు తెలియకుండానే నీవు నీ మాటలద్వారానో లేక నీ చేష్టలద్వారానో వేరెవరికో మనస్తాపం కలిగించి తీరతావు.  నీవు ఒకరికి కలిగించే సుఖం వేరొకొరికి ఖేదంగా మారుతుంది. ఆ ఖేదించేవాడు చేసే ఆక్రోశంలో వాడు నిన్నుచేసే అవమానాల్ని తట్టుకోగలిగే కవచం నీకు ఉండి తీరాలి. కానీ ఒకటిమాత్రం సత్యం.  ఈ సమాజసేవలో ఈ రాజకీయాలలో ఈ హైందవధర్మంలో ఈ భగవత్సేవలో స్వంతానికి సుఖంలేదు, సంసారానికి శాంతిలేదు.  కాబట్టి స్వసుఖాన్ని ఆశించి సమాజసేవలో దిగడం అనవసరం.  ఉన్నది ఒక్కటే! అదే స్వధర్మం… అదే ఆత్మత్యాగం… ’త్యాగేనైకే అమృతత్వం ఆనసుః’ అంటుంది వేదం. త్యాగం ఒక్కటే నీకు అమృతత్వాన్ని అందిస్తుంది.

కానీ గుర్తుంచుకో… నీవు నడిచే ఈ సమాజసేవలో ఈ దారిలో ఏదో  ఒకనాడు నీవారిచేతిలోనే నీవు నేలకొరగాల్సి రావచ్చు.  సీజర్ లాగా ’యూటూ బ్రూటస్’ అంటూ నీ ఆత్మీయులచేతిలోనే నమ్మినవారి చేతిలోనే నీవు వంచనకు గురికావచ్చు..  . కానీ అలాగని అందరినీ అనుమానించకు. సమాజసేవలో అనుమానానికి తావులేదు. తన నీడని తాను అనుమానించేవాడు ఏ లోకాన్నీ ఉద్ధరించలేడు.  కాబట్టి నిష్కల్మషమైన హృదయంతో నిస్వార్ధంగా నీ దారి నీవే ఎంచుకుని నడిచిపో… నీవుచేసే పనులను నీ ఆలోచనలను ఎదుటివాడు సమర్ధించాలని ఆశించకు.  భంగపడకు.   హిందువునని గర్వంగా చెప్పుకు తిరిగిన గాంధీగారినిగూడా హిందువుని అనుకొని అపోహపడిన కర్కోటకుడొకడు కాల్చి చంపాడు.  యాదవవంశ చందృడు అని పొగడబడ్డ శ్రీకృష్ణుడుగూడా యాదవుల చేతిలో చాలా తీవ్రమైన దెబ్బలుతిని చెట్టుక్రింద బాణంతగిలి తనప్రక్క తన అనేవారు ఎవరూలేకుండా చనిపోయాడు.  ఒంటరిగా పుట్టి ఒంటరిగా పెరిగి ఒంటరిలోకే మాయమయేది ఈ జీవితం… నీటిబుడగలాంటిది నిద్రిస్తున్న స్వప్నంలాంటిది… ఆశించకు… అలాగని ఆలసించకు…  -మాధవ తురుమెళ్ల, లండన్ 14/12/2013

 

Read More
06 Jun
0

మానవులు జంతువులు స్వలింగ సంపర్కం — నా ఆలోచన

మానవులు జంతువులు స్వలింగ సంపర్కం — నా ఆలోచన [… ఇక్కడనేను రాయబోతున్న కొన్ని వాక్యాలు కొంచెం జగుప్సాకరంగా అనిపించచ్చు.  కానీ సంధర్బాన్ని బట్టి రాయకతప్పడంలేదు.  మీకు మనస్తాపంకలిగించిఉంటే ముందస్తుగా క్షమాపణ చెప్పుకుంటున్నాను. – మీ మాధవ తురుమెళ్ల]

ఆకలి, నిద్ర, భయపడటం, మైధునక్రియపట్ల ఆసక్తి ఇవి జంతువులకు మనుషులకు సహజలక్షణాలు. ఆకలి అందరికీ వేస్తుంది, నిద్ర అందరికీ వస్తుంది, ప్రతి జీవిలోనూ భయం ఉంటుంది, అలాగే ప్రతిజీవికీ కామపు కోరిక ఉంటుంది.  జీవి అనేవాడు (ఆత్మ స్వరూపి) ఈ నాలుగింటివల్ల సంసారం అనే సాలెగూటిలో చిక్కుకున్నాడు అని వేదాంతం అంటుంది.  ఎంత కాదనుకున్నా ఆకలికి దూరంగా, నిద్రకిదూరంగా ఉండలేముగదా! ఎందుకని? ఈ నాలిగింటియొక్క రహస్యాన్ని తెలుసుకుంటే జీవుడు ఎలా బంధింపబడ్డాడో అనేది తెలుస్తుంది అని మన ఋషుల ఆలోచన.  అందుకే ఆహారానికి వ్యతిరేకంగా ఉపవాసం ఉండటం,  నిద్రకి వ్యతిరేకంగా శివరాత్రి వంటి పర్వదినాలలో జాగారం చెయ్యడం, భయపడటానికి వ్యతిరేకంగా సాహసకార్యక్రమాలలో పాల్గొనడం, కామానికి వ్యతిరేకంగా బ్రహ్మచర్యం చెయ్యడం చేస్తారు.  ఉపవాసకు, జాగారము, సాహసము, బ్రహ్మచర్యము గొప్ప తపస్సులుగా అందుకే కీర్తించబడ్డాయి.

హైందవ ఋషుల ఆలోచన ఏంటంటే ఈ నాలుగింటినీ ఏ జీవి వ్యక్తీకరించినా అది తప్పుకాదు – అది శిక్షార్హమైన నేరమూగాదు.  అయితే జంతుప్రవృత్తిపట్ల వారికి ఉన్న జాలి సానుభూతి అక్కడితో ఆగిపోయాయి.

ఆకలి వేసిందిగదా అని పక్కవాడి చేతిలో ఉన్నది లాక్కుని తినెయ్యము ఎందుకని?!  ఎందుకంటే ఏది మనదో దేనిని మనం ధర్మంగా సంపాదించామో లేదా దేనిని అనుభవించడానికి మనకు తోటి సమాజం అనుమతిని అందజేసిందో దానినే మనం అనుభవిస్తాము.  దీనినే ‘సంస్కారం‘ అని పిలుస్తాము.  అంటే మనం ఆహారనిద్రాభయమైధునాదులలో జంతువులతో సమానమైనా మనలోని ‘సంస్కారం‘ మనని వాటినుండి వేరుచేస్తుంది.  ఈ సంస్కారం అనేది వాసనాగతంగా వస్తే బుద్ధి వాటిని అమలులో పెడుతుంది కాబట్టి మనలను బుద్ధిజీవులు అన్నారు.  అన్నంతినాలన్న కోరిక పుట్టినప్పుడు ఏది తినదగినదో దానినే తింటాము అంతేగానీ పెంటను తినంగదా?!  కుక్కలు పందులు ఇత్యాది జంతువులు స్వంత తల్లితోటి చెల్లితోటి రమిస్తాయి. అవి జంతువులు వాటిని గమనించిన మనం వాటిపట్ల అసహ్యాన్ని పెంచుకోము.  కానీ అదే తోటి మానవుడు అటువంటి వావివరసలులేని కోరిక వ్యక్తపరిస్తే అట్లాంటికోరిక తీర్చుకోవడానికి ప్రయత్నిస్తే మనం తీవ్రంగా ఖండిస్తాము, తిరస్కరిస్తాము.  అంటే కామపుకోరిక కలిగిందిగదా అని ఏది సంస్కారవంతమో దానివల్లే కోరిక తీర్చుకుంటాము అంతేగానీ సంస్కారహీనంగా జంతువుల్లా ప్రవర్తించముగదా?!  బ్రహ్మదేవునికి తన కూతురిపై కామపు కోరిక కలిగిందట దాంతో శివునికి ఆగ్రహాన్ని కలిగించినవాడయాడు. శివునితో శిక్షించబడ్డాడు.  అదే మృగశిరారాశికి చెందిన కధగా మనకు పరిచయం.

కానీ ఇవాల్టి సమాజం మానవులని జంతువుల్లా ప్రవర్తించమనే ప్రోత్సహిస్తున్నట్లుగా అనిపిస్తోంది.  ఆకలివేసింది కాబట్టి దేన్నిబడితే దాన్ని ఎలాబడితే అలా తినెయ్యమని అనుమతించితే నరమాంసభక్షణని ఎందుకు అనుమతించగూడదు?!  అలాగే కామం కోరిక తీర్చుకోవాలిగాబట్టి ఆడామగా తేడాలేకుండా ఎవరుబడితేవారు ఎక్కడబడితే అక్కడ కామపుకోరిక వ్యక్తపరుచుకోవడం తీర్చుకోవడం చెయ్యండి అని అనుమతిస్తే మరి బలాత్కారానికి వ్యతిరేకంగా చట్టాలు చెయ్యడం దేనికి?!  మనం ఎంత జంతువులమయినా మన సంస్కారాన్ని మనం మరిచిపోవడం లేదా అసలు సంస్కారం అనేదేలేదనే వాదన చెయ్యడం మంచిదిగాదు.  దీనివల్ల సమాజం విలువలుకోల్పోయి అధోగతి పాలవుతుంది.  ధర్మచక్రం గాడితప్పుతుంది …

వ్యక్తిగతంగా స్వలింగసంపర్కం నేరం అనే విషయాన్ని నేను ఒప్పుకోను.  ఎందుకంటే జంతువులలో వావివరసలు లేకుండా రమించడం, అలాగే స్వలింగసంపర్కానికి పాల్పడడం సహజం. మనం జంతువులను శిక్షించము.   కానీ మానవులు జంతువులుగాదు – జంతువులుగా అనిపించేవాటిలోనే అధికులు!  ‘జంతూనాం నరజన్మదుర్లభం‘ జంతువుల్లో మనిషిగా పుట్టడం చాలా దుర్లభం అని అందుకే అన్నారు.   అందువల్ల సంస్కారం అనేదాన్ని తుంగలో తొక్కి స్వలింగ సంపర్కం చేస్తాము అంటే చేసుకోండి… ఎవరుకాదంటారు?!  కానీ మీ జంతుత్వాన్ని ఒప్పుకొమ్మనీ దానిని సమర్ధించమని మీరు నినాదాలుచేసి తోటివారిపై వత్తిడితేవడం భావ్యంగాదని మనవిచేస్తున్నాను.

అసలు సంస్కారాన్ని వదిలేస్తే జంతువులలాగా ఎక్కడబడితే అక్కడ పెంటకు వెళ్లచ్చు, అలాగే ఎక్కడబడితే అక్కడ ఉచ్చపొయ్యచ్చు.  అలాగే ఎక్కడబడితే అక్కడ దేనినిబడితే దాన్ని తినచ్చు. అలాగే ఎవరితోబడితే వారితో రమించచ్చు…. మనం వెసుకోవాల్సిన ప్రశ్నల్లా ఈ జంతుప్రవర్తన ఎక్కడితో ఆగుతుంది అని?!  దీనికి హద్దేంటి అని?…. మనముందున్న ప్రశ్న నేను మనిషిలా బ్రతకాలనుకుంటున్నానా జంతువులా బ్రతకాలనుకుంటున్నానా అని….

ఇకపోతే కొందరు హిందుధర్మగురువులు హరిహరుల సంగమాన్ని అయ్యప్ప జననాన్ని ఉదాహరణచెప్పి స్వలింగసంపర్కాన్ని హైందవమతం వ్యతిరేకించలేదు అని అపప్రచారం చేస్తున్నారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.  హైందవమతం పునర్జన్మను నమ్ముతుంది. ఒక జన్మలోని స్త్రీ మరొక జన్మలో పూర్తిగా పురుషునిగా మారచ్చు, ఒక జన్మలోని పురుషుడు మరొక జన్మలో పూర్తిగా స్త్రీగానూ మారచ్చు….శ్రీహరి మోహిని అవతారం ఎత్తి పూర్తిగా అతిలోకమోహన స్త్రీగా మారినట్లుగా  మనకు తెలుస్తోంది.  కాబట్టి అది స్వలింగసంపర్కం కాదు.

ఇకపోతే స్వలింగసంపర్కులు ఈ క్రింద ఇస్తున్న శ్లోకాన్ని ఎడాపెడా అన్నిచోట్లా ఉటంకిస్తూ హైందవధర్మంలో మిత్ర వరుణ అనేవారు స్వలింగ సంపర్కులనీ వారికి పుట్టినవారే వశిష్టుడు అగస్త్యుడు అని చెబుతారు.  భాగవతంలోని ఈ శ్లోకానికి స్వలింగసంపర్కులుచేసేది ఖచ్చితంగా అనుచితమైన వ్యాఖ్య!

రేతః సిశిచతుః కుంభే ఊర్వశ్యాః సన్నిధౌ దృతం
రేవత్యాం మిత్ర ఉత్సర్గం అరిష్టం పిప్పలం వ్యధాత్! భాగవతం 6.18.6

ఊర్వశిని చూడగానే [మిత్రావరుణులలో] కామపూరితమైన కోరిక కలిగింది వారిద్దరూ రేతాన్ని స్ఖలించారు. ఆ రేతస్సును కుండలో పెట్టారు. మిత్రునికి తన భార్య రేవతిద్వారా ఉత్సర్గ, అరిష్ట మరియు పిప్పల అనే బిడ్డలు పుట్టారు.

వివరంగా చూస్తే మిత్రుడు వరుణుడు ఇద్దరూ స్నేహితులు మగవారు.  ఇద్దరికీ ఊర్వశి కనబడింది. ఊర్వశి చాలా అందంగా అవయవ సౌష్టవంతో చనుబిగువులతో ఆకర్షణీయంగా ఉన్నది.  ఇద్దరూ మగవారే కానీ ఆ దేవవేశ్యను చూసి మనసుపడ్డారు.  ఇద్దరికీ ఊర్వశిని చూడగానే ఆ కామంలో రేతఃస్కలనం అయింది. —- ఇక్కడ ఒక్కక్షణం ఆగి పరిశీలనగా ఈ శ్లోకం చదవండి…. స్వలింగ సంపర్కులంటే మగవారిపట్ల మగవారు అలాగే ఆడవారిపట్ల ఆడవారు ఆకర్షితులవడం.  మరి ఈ సందర్భంలో మిత్రుడు వరుణుడు ఇద్దరూ మగవారే కాబట్టి వారు ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులైతే దాన్ని మనం స్వలింగ సంపర్కంగా పరిగణించవచ్చు.  కానీ ఇద్దరూ ఒకే ఆడదానిపట్ల ఆకర్షితులయారు.  అది సహజమేగదా! వారి రేతస్సును ’కుంభం’లో నిక్షిప్తం చేసారు అని ఉంది.  ’కుంభం’ అంటే మట్టికుండ అని సామాన్యార్ధం కానీ మానవదేహంగూడా మట్టితోచెయ్యబడ్డదే!  ఆవిధంగా చూస్తే స్త్రీ యోనిని [రేతస్సును భద్రపరచగల / నిక్షిప్తం చెయ్యగల మట్టితోచెయ్యబడ్డ] కుంభం అనచ్చు.  యోని అనకుండా కుంభం అని ఉండచ్చు.   ఆవిధంగా చూస్తే బహుశా మిత్రుడు వరుణుడు కలిసి ఊర్వశితో ఒకేసారి రమించి ఉండచ్చు.  అగస్త్యుడు వశిష్టుడు ఇద్దరూ ఊర్వశికి పుట్టిన బిడ్డలుగా మనకు తెలుస్తోంది.  కానీ వారి తండ్రి మిత్రావరుణులు – ఇద్దరూ అయుండచ్చు.  బహుశా డిఎన్‍ఎ పరీక్షల్లో ఎవరికి  ఎవరు నిజంగా పుట్టారో తెలిసి ఉండేది.  కానీ మిత్రుడికి వరుణుడికీ వారు మనసుపడి రమించిన ఊర్వశికి ఆ సంశయం రాలేదు.  అందువల్ల పుట్టిన బిడ్డలకు తండ్రి ఎవరు అంటే – ఇద్దరు తండ్రులు అని చెప్పడం జరిగింది.

మరి ఈ కధనంలో స్వలింగసంపర్కానికి తావెక్కడ?!  ఇలా ఈ శ్లోకాన్ని స్వలింగ సంపర్కులు తమ కక్కుర్తికోసం వాడుకోవడం ఇంతకంటే అన్యాయం ఇంకొకటి ఉందా?! ఇకపోతే అదేశ్లోకంలో మిత్రుడి భార్య రేవతి అతడి బిడ్డల ప్రసక్తి ఉంది.  కాబట్టి స్పష్టంగా ఈ ఇద్దరు మగవారు మిత్రావరుణులు ఆడవారిపట్ల ఆకర్షితులయారేగానీ వారు స్వలింగ సంపర్కులు కాదు.

ఈ నా నలభైఆరేండ్ల జీవితంలో నేను నాలుగువేదాలు చదివాను, రామాయణ భారతేతిహాసాలు చదివాను. అష్టాదశపురాణాలు ఉపనిషత్తులు అలాగే చిన్నా చితాకా ధర్మగ్రంధాలుగా చెప్పబడ్డ అనేక పుస్తకాలను చదివాను. ఎక్కడా ఏ గ్రంధంలోనూ స్వలింగసంపర్కాన్ని గూర్చిన చర్చలేదు అని నేను ఘంటాపధంగా చెప్పగలను.

కామాన్ని గురించి చర్చించిన శాస్త్రాలలో హైందవ వివాహమే ఒక గొప్ప దిశానిర్దేశాన్ని చేస్తోంది. రజస్వల అయిన ఆడపిల్లను కన్య అనిపిలుస్తారు. అటువంటి కన్యను మగవాడు కోరుకుంటాడు. ఆడమగ అనేది ఇక్కడ స్పష్టం. హైందవధర్మంలో వివాహం చాలా స్పష్టమైన నిర్దేశాన్నికలిగి ఉంది. శుక్రశోణితాల కలయికకోసం ధర్మపరమైన బిడ్డలకు సహజసిద్ధంగా జన్మనివ్వడంకోసం (ధర్మప్రజాసిద్యర్ధం) తల్లి పూర్వరూపంగా తండ్రి ఉత్తరరూపంగా బిడ్డలే సంధిగా వారుపాల్గొనే సృష్టికార్యమే సంధానంగా (మాతా పూర్వరూపం పితోత్తరరూపం ప్రజా సంధిః ప్రజనగ్‍ం సంధానం -యజుర్వేదం) హైందవ వివాహవ్యవస్థ ఏర్పడినట్లుగా మనకు తెలుస్తోంది.

నిజానికి ఆధునిక కాలంలోని తల్లితండ్రులు పాశ్చాత్యసంస్కృతిని పాటించి తమలోని కామపుకోరికను తీర్చుకోవడంకోసం తమకు పుట్టిన పిల్లలను దూరంగా ఎక్కడో గదుల్లో పడుకోబెట్టేస్తున్నారు.  ఆ పసిమనసుల్లోని భయాలకు అంతులేదు.  తల్లి తండ్రి ఆడమగ అనే భేదాన్ని సృష్టికార్యాన్నిగురించిన అపోహను పెంచుకున్న పసిమనసుల్లో తమలోని భయాన్ని పోగొట్టుకోవడానికి తల్లికి తండ్రి తోడుగా ఉన్నట్లే తమకుతోడుగా రాత్రి ఎవరూ లేక తమకుతామే తోడనుకుని స్వలింగసంపర్కంపట్ల ఊహలు పెంచుకుంటున్నట్లుగా తాము పెద్దవారయిన తర్వాత స్వలింగసంపర్కులుగా మారుతున్నట్లుగా పరిశోధనల్లో తెలుస్తోంది.  దీనిపట్ల మరింత పరిశోధన అవసరం.

స్వలింగ సంపర్కం అనేది ఈ పైన చెయ్యబడ్డ నిర్దేశానికి పూర్తిగా వ్యతిరేకం.  కాబట్టి అటువంటిదానిని ఏ హిందూ ధర్మగురువూ సమర్ధించగూడదు.  జంతువులు నేరం చెయ్యలేవు. అలాగే కొంతమంది మనుషులుగూడా నేరం చెయ్యలేరు.  కాబట్టి అది నేరంగాదు కానీ దానికి పూర్తి అనుమతి అడగడం పైగా ధర్మగురువులు దాన్ని సమర్ధించడం సమాజంలో నశించిపోతున్న విలువలకు సూచనగా భావిస్తాను.   ఓం స్వస్తి – మాధవ తురుమెళ్ల

 

Read More
06 Jun
0

నీవు ఒక సముద్రం వంటివాడివి

భగవద్గీత ధ్యానమునుండి నాకు తోచిన కొన్ని విషయములు:

ఆపూర్యమాణ మచల ప్రతిష్ఠమ్ సముద్రమాపః ప్రవిశన్తి యద్వత్|
తద్వత్కామా యం ప్రవిశన్తి సర్వే స శాన్తి మాప్నోతి న కామకామీ|| భగవద్గీత 2.70

జలములచే సంపూర్ణముగ నిండింపబడినదియు, నిశ్చలమైనదియునగు సముద్రమును నదీజలము మున్నగునవి యేప్రకారము ప్రవేశించుచున్నవో, ఆ ప్రకారమే భోగ్యవిషయములన్నియు ఏ బ్రహ్మనిష్ఠుని పొంది (ఆతనిని వికృతముచేయలేక) అణగిపోవుచున్నవో, ఆతడే శాంతినిపొందునుగాని విషయాసక్తికలవాడు కాదు.

నీవు ఒక సముద్రం వంటివాడివి…. సముద్రంవంటి నీలో ఆలోచనలు అలల్లాగా నిరంతరం లేచిపడుతూఉంటాయి.  ధర్మం అనేది సముద్రంలాంటి నిన్నుశాశించే చెలియలికట్ట!  తుఫాను చుట్టుముడితే సముద్రం అల్లకల్లోలమవుతుంది, చెలియలికట్టని దాటాలని ప్రయత్నిస్తుంది. అలాగే నీ దైనందిన జీవితంలో పరిస్థితులనే తుఫాను చుట్టుముడితే ఆలోచనలు అలజడి చెందుతాయి… ధర్మమనే చెలియలికట్టనిదాటి అధర్మాన్ని చెయ్యమని నీ చుట్టూ ఉన్న లోకాన్ని నిర్దాక్షిణ్యంగా కబళించెయ్యమని ముంచెయ్యమనీ ప్రేరేపిస్తాయి.  నీవు సముద్రంవంటివాడివనీ నీ ధర్మపు హద్దులలో నీవుంటావని నమ్మి నీతోడుగా నీడగా నీ జీవితపు ఒడ్డుపై నిర్భయంగా నిలబడిన జీవులు ఎన్నెన్నో!  నీ తల్లి, నీ తండ్రి, నీ భార్య, నీ పిల్లలు, నీ మిత్రులు ఇలా ఎందరో నీపట్ల నీ జీవితపు ధార్మిక చెలియలికట్టని నమ్మి ఉంటారు. కాబట్టి నీవు తుఫానులో మునిగినా నీ ధర్మాన్ని తప్పకు… లోక కంటకుడిగా మారకు… నిన్ను నమ్మినవారికి కన్నీరు తెప్పించకు. వారిని నట్టేట ముంచకు.. ధర్మో రక్షతి రక్షితః.   -మాధవ తురుమెళ్ల 16/01/2012

Notes from meditation on Gita:
Apuryamanam achala-pratishtham samudram apah pravisanti yadvat,
tadvat kama yam pravisanti sarve sa santim apnoti na kama-kami (2.70)
A person who is not disturbed by the incessant flow of desires—that enter like rivers into the ocean, which is ever being filled but is always still—can alone achieve peace, and not the man who strives to satisfy such desires.

You are like an ocean.  Waves of thoughts continuously raise and fall in the ocean called you.  The shore called ‘Dharma’ (virtue) keeps the ocean called you in control.  Ocean gets disturbed when there is cyclone, it tries to overrun the shore, it becomes a tsunami. Same way, when your daily life gets bogged down in the cyclone called situations, you might try to overlook your virtue.  You might be propelled to do the the opposite of being virtuous.  You might be propelled to ruthlessly destroy the world around you.  Believing that you are like an ocean; believing that you will always be virtuous  believing that you know how to take good care of your life there are many beings who innocently and quite confidently stand at the shores of your life!  Your parents, your wife, your children, your friends and many other people internally believe in your vitue and stand by your side.  Hence even though you are surrounded by a mighty cyclone never lose your virtue.  Never lose the sight of people who believe in you.  Never become a tyrant.  Never cause to bring tears in the eyes of people who believed in you.  Never desert them.  Dharma protected shall protect you….  -Madhava Turumella 16/01/2012

Read More
06 Jun
0

సత్యమేవ జయతే నానృతం – ముండక ఉపనిషత్తు 3.1.6

సత్యమేవ జయతే నానృతం – ముండక ఉపనిషత్తు 3.1.6
-మాధవ తురుమెళ్ల
2birds
ఎవరో నిన్న అడిగారు ’అమీర్‍ఖాన్ సత్యమేవజయతే చూస్తున్నారా?  ఎక్కడ్నించి తీసుకొచ్చాడోగానీ కాన్సెప్ట్’’ అని.  ఆ పక్కనే నుంచుని ఈ సంభాషణ వింటున్న ఇంకొకరెవరో అన్నారు ‘ఎక్కడ్నించో తేవడమేమిటి మన భారత రాజముద్ర కింద ఉందిగదా! స్పష్టంగా!” అని..  ఈ సంభాషణ విన్న తర్వాత నేను చెప్పాను.  “అయ్యా ఈ ’సత్యమేవ జయతే’ అన్న మాట ముండక ఉపనిషత్తులో ఉంది.  అది మూడవ అనువాకం ఒకటవ కాండంలో ఆరవ శ్లోకంలో ఉంది” అని.
బానేఉంది కానీ మూడవ అనువాకం మొదట్లో ఒక చిన్న పిట్టకధ ఉంది.  ఆ కధకు ఆ తర్వాత ఐదుశ్లోకాల తర్వాత వచ్చే ’సత్యమేమ జయతే’కు సంబంధం ఉంది అని చెప్పాను.  ఆ విషయం మీతోకూడా పంచుకోదలచుకున్నాను.ముండక ఉపనిషత్తు మూడవ అనువాకంలో “ద్వా సుపర్ణా సయుజా సఖాయా సమానం వృక్షం పరిషస్వజాతో తయో రన్యః పిప్పలం స్వాదత్తయన్నసన్నన్యోభిచక్షతి”  “ఒక చెట్టుపైన రెండు పిట్టలు కలిసి జీవిస్తున్నాయి, అవి రెండూ ఒకదానితో ఒకతి స్నేహంగా సఖ్యతతో ఉంటాయి.  ఒకపిట్ట ఆ చెట్టుకుకాసిన తియ్యటి ఫలాలను తింటూ ఉంటే మరొకపిట్ట ఫలాలను తినకుంటా తింటున్న పిట్టను చూస్తూ ఉంటుంది” అని ఒక రెండుపిట్టల కధ చెప్పారు.  ఇంతకీ ఈ కధకీ సత్యమేవ జయతేకు సంబంధం ఏంటి?ఆ పిట్టలలో ఒకటి ఈశ్వరుడు రెండోది జీవభావం.   ఈ రెండుపిట్టలూ ఉన్న చెట్టే మనిషి… అందుకే తెలుగులో ’చెట్టంత మనిషి’ అని ఒక నానుడి ఉంది.   ప్రతి మనిషిలోనూ ఈశ్వరుడున్నాడు. ఇతడు సర్వ స్వతంతృడు.  కానీ ప్రతి మనిషిలోనూ జీవభావమూ ఉంది.  ఈ జీవభావం చాలా అస్వతంత్రతతొ అభద్రతతో కూడుకున్నది.  ఇది ప్రతిక్షణం భయంతో పిరికిగా బ్రతుకుతుంటుంది. బ్రతుకుభయం, చీకటిభయం, నీటిభయం, చావుభయం, డబ్బు సంపాదించాలంటే భయం, సంపాదించుకుంది పోగొట్టుకుంటామనే భయం… ఇలా అనేకభయాలతో పిరికిగా బ్రతికే జీవుడు తనకి ప్రపంచంలో దొరికిన ప్రతి అవకాశాన్ని ఆబగా అనుభవించుదామని చూస్తుంటాడు.  ఉదాహరణకు ఒక నలుగురు మంచివారు కలిసి ఒక సదస్సు పెట్టారనుకుందాం ఒకరాజకీయనాయకుడు ఆ సదస్సును అవకాశంగా తీసుకుని ఆ వేదికపైకి వచ్చి మాట్లాడదామని ప్రయత్నం చేస్తాడు, ఒక వ్యాపారవేత్త ఆ సదస్సులో పాల్గొనే నృత్యగీతకారులతో సఖ్యతచూపుతాడు… ఇక్కడిదాకా బాగానే ఉంది.  కానీ ఆ రాజకీయనాయకుడుగానీ ఆ వ్యాపారవేత్తగానీ ఇంకొకరిని ఆ వేదిక ఎక్కనివ్వరు, ఆ నృత్యకారులతో మాట్లాడనివ్వరు.  అంతర్లీనంగా ఇక్కడ ఆ జీవులలో ఒక అభద్రతాభావం ఒక భయం అంతర్లీనంగా ఉండి వారిని ఆ అనుభవాలు వారొక్కరే అనుభవించేలా ప్రోత్సహిస్తుంది.  అంటే ఇదంతా భయంవల్ల వచ్చిన ప్రతీకార చర్యలన్నమాట!  ఇంకొక ఉదాహరణ ఒక వ్యాపారవేత్త ఒక వ్యాపారం మొదలుపెడితే ఇంకొకవ్యాపారవేత్త దానికి ఆటంకం కలిగించాలని ప్రయత్నించడంగూడా అతనిలోని భయానికి చిహ్నమే.  అంటే అతడు వ్యాపారం చేసి సంపాదించాల్సిన సొమ్మును ఇంకొకడు అదే వ్యాపారం చేసి సంపాదిస్తే అతనికి రావల్సిన “ఆహారం, కీర్తి, పలుకుబడి, అధికారం” అనే ఫలాలు తినేస్తాడానే భయం.     ఇలా చెప్పుకుంటూపోతే అనేక సందర్భాలలో మనం మనలోని భయాలవల్లే ప్రవర్తిస్తుంటాము.  ఇంకొకరిని మనం తినే ఫలాలవద్దకు రాకుండా చూసుకుంటాము.  ఇది జంతులక్షణం…. ఇది పక్షిలక్షణం.మనం కొన్నికొన్నిసార్లు అబద్దాలు చెబుతాము. అబద్ధాన్నే సంస్కృతంలో అనృతం అంటారు. ఆ రెండుపిట్టల్లో ఒక పిట్ట్ జీవుడనిచెప్పుకున్నముగదా.  ఆ తినేపిట్ట జీవుడు అనుభవించే ఫలాలన్నీ ఈ ప్రపంచంలో అనుభవాలే.  ఇక ఆ రెండవపిట్ట ఈశ్వరుడు.  అతడికి ఈ ఫలాలపై ఆసక్తిలేదు. తినాలన్నకోరికాలేదు. కోరిక లేనందువల్ల అతడు హాయిగా ఉన్నాడు.  కానీ భయంవల్ల మనంచేసే ప్రయత్నాలన్నీ మనకు ప్రపంచంలో జయాన్ని సంపాదించిపెడతాయేమోగానీ మననుంచి అతి ముఖ్యమైన ’ఆత్మశాంతి’ని కోల్పోతాము.

సత్యం చెప్పడంవల్ల మనలోని తినేపిట్ట (జీవభావం) నుండి మనం విముక్తిపొంది… తిననిపిట్ట (ఈశ్వరభావం) గా మారుతాము.  జరిగింది జరిగినట్టుగా చెప్పడం, ఎటువంటి అరమరికలు లేకుండా (సమయాసమయాలు ఎరుగకుండాకాదు) , నిస్సంకోచంగా (దోపిడీగా కాదు) , నిర్మొహమాటంగా (కర్కశంగా కాదు) ప్రవర్తించడం వల్ల మనలోని భయాలకు దూరమై, మనం మనంగా ప్రవర్తిస్తాము.  అనృతంవల్ల మనకి తాత్కాలికంగా జయం కలిగినా తర్వాత వచ్చే దుష్పలితాలు అనేకం… కొన్నికొన్నిసార్లు మనం చెప్పే అబద్ధం ఆడే రాజకీయాలు మన జీవితానికే ముప్పుతెచ్చిపెట్టి మన కుటుంబాన్ని అల్లకల్లోలం చేసి వదిలిపెడుతుంది.  అందుకే సత్యానికి దగ్గరగా బ్రతకడమంత హాయిఐనది ఇంకొకటిలేదు.  ఈ ప్రపంచంలోకి వచ్చేటప్పుడు మనం దేన్నీ తెచ్చుకోలేదు, ఇక్కడ్నించి పోయేటప్పుడు దేన్నీ తీసుకోని పోము… ఇక మధ్యలో ఎందుకీ తాపత్రయం!  ఏది జరగాలో అది జరుగుతుంది… ఎందుకు భయం! ’సత్యమేవ జయతే నానృతం’….  ఓం తత్సత్….

————xxxxxx————–xxxxxx—————xxxxxxx————

 

Read More
06 Jun
0

నా ఆలోచన: Ego (ahankar) అహంకారం

ఎడారిలో చిక్కుకున్నవాడు తన ఒంటెను వదిలిపెట్టెయ్యడమంత తెలివితక్కువ పని ఇంకొకటి లేదు. అలాగే సంసారం అనే ఎడారిలో చిక్కుకున్నవాడు తన ఆసరాగా ఉన్న అహంకారం అనే ఒంటెను, అసలు అది ఎందుకుంది, జీవితంలో దాని అవసరం ఏంటి అనేది తెలుసుకోకుండా వదలడం మంచిదిగాదు. అహంకారం అనేది చాలా అవసరం. అది భగవంతుని అష్టప్రకృతిలలో ఒకటి. నిజానికి నాకు అనిపించేదేంటంటే భారతవేదాంతంలో ‘అహంకారం‘ అనే పదం చాలా అపార్ధం చేసుకోబడింది. ‘నీకు చాలా అహంకారం‘, ‘వాడికి చాలా అహంకారం‘ అని అహంకారం అనే పదాన్ని ఎదుటివారిని విమర్శించడానికి చాలా తేలికగా వాడేస్తారు. ఈ సృష్టిలో ఏదైనా ఉంది అంటే దానికి ఒక అవసరం ఒక కారణం రెండూ ఉండి తీరతాయి. మనకి ఒక వస్తువు/వ్యక్తి/పరిస్థితి యొక్క అవసరం దాని కారణం ఇవాళ తెలియకపోవచ్చు. కానీ భగవంతుని సృష్టిలో ఏదీ వ్యర్ధంకాదు. అందుకని అహంకారానికిగూడా ఒక కారణం ఉంది. అహంకారం ఒక ఉపకరణం. అది ఒక వాహనం. అది ఒక ఎడారి ఒంటె దాన్ని సరిగా వాడి తరించడానికి తప్పించుకోవడానికి ప్రయత్నించడం అవసరం. అంతేకానీ తెలిసీ తెలియకుండా అహంకారాన్ని అణగదొక్కుదామని చూస్తే మీరు మానసికంగా బలహీనులవుతారు. ఎదుటివారు మిమ్మల్ని తమ స్వార్ధంకోసం పావుల్లా వాడుకుంటారు. అహంకారాన్ని అర్ధం చేసుకోకుండా అణగదొక్కడం వల్ల మీలో మీకే తెలియని ఒక విషాదం వస్తుంది. మీలో తితిక్ష లోపిస్తుంది. రాత్రి సుబ్బారావుగా నిద్రపోయిన వ్యక్తి ఉదహం సుబ్బారావుగా నిద్రలేవడానికి కారణమే అహంకారం! అదిలేనినాడు వ్యక్తికి వ్యక్తిత్వం లేకుండాపోతుంది.

అందుకే అన్నారు “కామిగానివాడు మోక్షగామిగాడు” అని అహంలేనినాడు ఏ కోరికా లేదు. కోరికకు మంచి చెడ్డ అనేవి లేవు… సన్యాసం తీసుకోవాలన్నకోరికగూడా వదలగలిగినవాడే నిజమైన సన్యాసి అన్నారు. సమో’హం’ (ఇందులోని అహం ని గుర్తించండి) సర్వభూతేషు నమే ద్యేష్యోస్తి నప్రియ:… అహం మనకు కనబడకపోయినా జీవభావాన్ని అదే నడిపిస్తోంది. వదిలామనుకున్న మహామహులే దాని వలలో చిక్కుకున్నారు. రైల్లో కూర్చుని ప్రయాణం చేసేవాడు తాను ప్రయాణిస్తున్నాను అనుకుంటాడు. కానీ నిజానికి అతడు కదులుతున్నాడా పరిగెత్తుతున్నాడా? రైలు పరిగెత్తుతోంది అతడు దాంట్లో కూర్చుని ఉన్నాడు.

మనిషికి అహంకారం వల్లే జీవనం… తెలుసుకోండి… అహంకారం వదలడం అనేది ఒక పరిపక్వత. మీరు అహంకారాన్ని వదలలేరు అదే మిమ్మల్ని వదులుతుంది. ‘ఉర్వారుకం ఇవ‘ పండిన దోసపండు ఎలాగైతే తీగనుండి విడివడుతుందో అలా మీరు తరించిననాడు మీ అహంకారం మిమ్మల్ని వదులుతుంది. ఆరొజుకోసం తెలివిగా ప్రణాలిక వేసుకోండి.
ధ్యానంతో కూడిన మీ అహంకారపూరిత జీవనాన్ని సాగించండి. తరించండి. -మాధవ తురుమెళ్ల

It is not wise for a person who is stranded in a desert to let go his camel. Same way a person who is stranded in this world should not let go his Ego with out first knowing what it is and why it is there! You must be able to use your ego for the right purposes. I think Ego (ahankar) is the mostly misunderstood and widely misquoted term In Indian philosophy (vedanta). It is essential to understand that nothing in this God created world is useless. Everything has a purpose and a meaning. Purpose of a person/thing/event may not be evident today but suffice to understand that if something is there then there is a purpose and meaning behind it. Similarly Ego has a purpose. Gita says that Ego is one of the eight primal energies (Astaprakriti) of God. [Gita 7.4]. I think Ego is an instrument; it is a vehicle; it is a desert camel. It is essential you must use it for the right purpose and transcend your life. People who suppress their Ego with out knowing Ego’s purpose become mentally weak. They get unstable in their life. They get abused by the people with ulterior motives. Ultimately they become a failure in life. A Subbarao who went to sleep wakes up as Subbarao only because of the Ego. It gives identity to your life. Consider that when you don’t have Ego then you become confused being. Man finds his livelihood only because of his Ego. It is considered maturity when you let go your Ego. But I think, In fact, you can’t let go your Ego. On the contrary – I think – when time comes your Ego lets you go! Just like a creeper automatically lets go of it’s ripened Cucumber Ego lets you go! Plan for that day when your Ego lets you go. Till then meditatively live your life with the help of your Ego.

Through
the Body (B), Mind (M), Intellect (I)
the Perceiver (P), Feeler (F), Thinker (T)
becomes enmeshed in the world of
Objects (O), Emotions (E) and Thoughts (T)

But when we transcend our
Vasanas (V)
we realize our true Self
OM
the Supreme Reality

1557708_10151991486319213_1675774530_n
Ashta Prakriti is behind the BMI chart. If BMI were a body of a vehicle which is trying to reach its destination called “OM” then Ego is like tires to the total BMI. Ego carries the BMI towards Om… Also where there is no destination to reach you don’t need tires. During the bilissful awareness “YOU ARE THAT” Ego drops you like a cucumber is dropped by its creeper.

So without ego there is also no spiritual journey. It is finally aatma decides when to leave the ego and move towards OM..

Naayam Atma pravachano Labyah.
Na Medhaya Na Bahuna scrutena.
Yam eva esha vrunute tena labhyah.
Tasya Esha Atma vivrunute tanum swam. kathopanishad (1.2.23) and also in [Mundaka 3.2.3]

The atma cannot be logically deduced or read about or heard about. It reveals itself to the one who who earnestly and worshipfully seeks it.

So then what is it that we are doing?! Is all our Sadhana a waste? NO you need to have Ego to hold you in a certain place in sadhana. And when the time comes when HE (Atman) chooses to reveal itself – your Ego drops you like a creeper drops its Cucumber [such a sadhaka though appears like attached to the world – he is detached because his Ego dropped him – Atma has chosen HIM – he becomes his natural self – this is called parambhavaatmikata]

In Kathopanishad next verse describes the qualities of the person who is fit to receivethe revelation of the Self.

navirato duscharitannaashaanto naasamaahitah |
naashaantamaanaso va’pi prajnaanenainamaashnuyaat (Katha 1.2.24)

One who has not given up those actions which are prohibited by the shastras, who senses are not controlled, whose mind is in turmoil or even though disciplined still lusts after material objects cannot know this self. i.e. A hypocrite can not know the self.

But one who only does that which is commanded by the shastras, whose mind
and senses are completely controlled and has turned away from material
things will certainly come to know the true Self.

The very same verse appears in Mundaka Upanishad 3.2.3. And just like in Katha the following verse in Mundaka qualifies the person to receive that Grace.

“Nāyam ātmā bala-hīnena labhyo” [Mundaka 3.2.4] This Atman is not available to someone who is weak.

Mental and Intellectual weakness happens only when you do not have a proper ego. You need to have proper construction before you decide upon destruction. Thou shall be strong. This being strong “bala” is only possible with the help of Ego.

The mahavakya ‘ahaM brahma asmi’ also has aham in it. We know it is there but we can’t quantify it. We only see the force of it. -Madhava Turumella

[Notes from my meditations on Gita 7.4]

Read More
06 Jun
0

చదువుకున్నవాడికంటే చాకలివాడు ఎలా నయం? – కధ!

చదువుకున్నవాడికంటే చాకలివాడు ఎలా నయం? – కధ! 

ఒకసారి ఒక గ్రామంలో పండితులు, తర్కశాస్త్రజ్ఞులు, మీమాంసకులు ఇలా అందరూ కలిసి ఓ ఇంటి అరుగుమీద సభ జరుపుకుంటున్నారు. అటుజరిగి ఇటుజరిగి వాళ్ల చర్చ ‘వైకుంఠం ఎక్కడ ఎంతదూరంలో ఉండి ఉంటుంది?‘ అనే విషయంవైపు జరిగింది. ఒక పండితుడేమో వైకుంఠం కొన్నివేలకోట్ల ఖగోళాలకు అవతల నిజంగా ఉన్న ఒక పాలసముద్రంలో ఉన్నదన్నాడు, తార్కికుడేమో అలాగాదు చంద్రుడు లక్ష్మీదేవితోపాటే పుట్టాడు ఆయనని మనం రోజూ చూడగలుగుతున్నాము. తన అక్క లక్ష్మీదేవికి దూరంగా చంద్రుడు ఉండడు కాబట్టి వైకుంఠం ఎక్కడో చంద్రమండలానికి అవతలవైపు ఉండచ్చు అని తార్కికంగా చెప్పాడు. 

అదే గ్రామంలో ఒక చాకలివ్యక్తి నివసిస్తున్నాడు. అతడు తన బట్టలను తీసుకుని చెరువుకుపోతూ ఈ పండితులనందరినీ గమనించాడు. తనదారిన తాను వెళ్లిపోయాడు. సాయంత్రం అతడు తిరిగి వస్తూ ఆ పండితులు ఇంకా గట్టిగావాదించుకుంటూనే ఉండడం గమనించాడు. ‘ఈ పండితులు ఉదయంనుండీ సాయంత్రందాకా ఏం వాదించుకుంటున్నారా!‘ అని సందేహం వచ్చి వాళ్లని వెళ్లి కారణం అడిగాడు. వాళ్లు ‘మేం వైకుంఠం ఎక్కడఉందో వాదించుకుంటున్నాము‘ అంటే అతడు తలగుడ్డతీసి తన తలగోక్కుని. ‘ఇంతమాత్రం దానికి ఉదయంనుండి సాయంత్రం దాకా వాదించుకోవాలా బాబయ్యా?!‘ అని ఆశ్చర్యంగా ఆడిగాడు. దాంతో ఈ సారి ఆశ్చర్యపోవడం ఆ పండితుల వంతయింది. “అంటే ఏంటి?! నీకు వైకుంఠం ఎక్కడుందో తెలుసా?! ఇంత చదువుకున్నాము మాకే తెలియని అతి సూక్ష్మమైన ఈ శాస్త్ర రహస్యం నీకెలా తెలుస్తుంది… పో పో నీ పనిచేసుకో…” అని ఈసడింపుగా పలికారు. “అయ్యా! నేను తమరంత చదువుకోలేదండీ. కానీ నాకు వైకుంఠం ఎక్కడుందో చూచాయగా తెలుసండీ… నేను మా పంతులోరు మొన్నీమధ్య బాగోతం (భాగవతం) చెబుతాఉంటే ఇన్నానండీ బాబయ్య! మా పంతులోరు చెప్పారు ఆ ఏనుగు (గజేంద్రుడు) ప్రాణంబుల్ ఠావుల్ దప్పె మూర్చవచ్చె… అని మరంత మూర్చవచ్చే పరిస్థితుల్లో మాటలే రావు గదా బాబయ్యా. మనం చావబోయె మనిషి చెప్పేమాటలు వినాలంటే నోటిదగ్గర చెవిబెడితే గానీ వినబడవు గదా బాబయ్యా! మరి ఆ ఏనుగు చాలా బలహీనంగా అరిచిందిగదా… ‘రావే ఈశ్వరా… రావే వరదా…. రావే గోవిందా…‘ అని అయినాగూడా ఆ ఏనుగు మాటలు ఆ వైకుంఠయ్యకు వినపడ్డాయి అంటే బహుశా ఆ వైకుంఠం ఇక్కడే ఎక్కడో మహా అయితే ఓ నాలుగిళ్ల అవతల ఉండుంటుందండీ‘ అని చెప్పి తనదారిన తాను వెళ్లిపోయాడు. ఎన్నో శాస్త్రాలను అభ్యసించి వైకుంఠం ఎక్కడ ఉందో తెలియని చదువుకున్న పండితులకంటే, ‘తన పంతులయ్య చెప్పిన భక్తి వెనుక తనదైన నమ్మకం పెట్టుకుని వైకుంఠం మా ఇంటిపక్కనే ఎక్కడో ఉంది అని తార్కికంగా సమాధానపడి తన రోజువారీ పని (కర్మయోగం) చేసుకుంటున్న చాకలివాడు కొన్ని లక్షలరెట్ల నయం‘ అని అప్పట్నించీ ‘చదువుకున్నవానికంటే చాకలివాడు నయం‘ అన్న నానుడి పుట్టింది. -మాధవ తురుమెళ్ల

Read More
06 Jun
0

As I think – Living is to be able to cherish the unconditional love

images

As I think – Living is to be able to cherish the unconditional love which we receive from life in the forms of wife, children, family members, friends, our pets and our surroundings!… The art is to be able to thank our Gods for the blessings we received in our life. In fact, we are surrounded by blessings! Our soul magically anchors its existence to these blessings, that is why it wants to live the dream of life, even though it intrinsically knows that everything is momentary! Soul can feel the blessing even in the momentary happiness! On the contrary misery is the address of the soul which can’t recognize the blessings it received in its life, as a result it drifts and drifts like a ship devoid of anchor lost in the vast ocean. That is why it is important to train your soul to remember blessings. The technique is to be able to recollect, to be able to remember our blessings when we are facing the most stressful situations in life! Because we make less mistakes in life only when we manage to remember and recollect our blessings. Also remember that we are in deed make someone else’s blessing! Someone may be out there at this very moment liking the very fact that you are there for her on this planet breathing! Your children, your family members like you for who you are… they may be liking the fact that you are there in their life..! You became the part of certain people’s world, so it is time to beautify it… Time to cherish it… As I see it the world is an intricate web of love. Our right relations are full of continuous transactions where there is no profit motive involved! Live and enjoy your blessings… Life is too small to hold grudges… Let us aim to live happily and die peacefully!  -Madhava Turumella, Sofia, Bulgaria 24/01/2014

Read More
06 Jun
0

కవిత: పొలిటికల్ కరపత్రిక

పొలిటికల్ కరపత్రిక


ఎక్కడో
మస్తిష్కంలో మూలలో దాగిన
ఒక మాటకి అందని మౌనానికి-
తిరస్కృత పరిష్వంగానికి
తిమిరనిరంకుశ నిశీధికి
తితీక్షకు, తీతువుపిట్టకు,
హాలాహలానికి హాహాకారానికి
అవినాభావ సంబంధం ఉన్నదని –
ఒక మునికి జ్ఞానోదయమైంది.

వెలిగించండి మెదడుల్లో కాగడాలను
తొలగించండి జ్ఞానేంద్రియ కవాక్షాల కెరటాలను
చల్లండి బతుకువీధుల్లో పాపప్రక్షాళితంగావించే పావనగంగను….

రేపొక మహోదయం కాబోతోంది
అకించనితయై 
అనారోగ్య 
రక్కసి కాటేస్తున్న కన్నపేగును
పసిపాపను పొత్తిళ్లలో ఎత్తుకున్న తల్లి
ముసిముసి నవ్వులు నవ్వబోతోంది….
పూటతిండికి నోచుకోని దౌర్భాగ్యపు ముసలి ఒకతె
రేపు భారతదేశం నాది అని గర్వపుగీతిక పాడబోతోంది.

రోపొక మహోదయం కాబోతోంది.

[రేపు రిపబ్లిక్‍ డే కదా…..!!!!! ]
-మాధవ తురుమెళ్ల 25/1/2013

Read More
06 Jun
0

As I think: Know that there were Seers without Agendas in Ancient Hinduism

 

In Sanskrit the word “Sva” means “Tomorrow”. “aSva” means “No Tomorrow”. aSva is normally translated as Horse Animal. There- are a particular kind of Seers praised in Veda and Scriptures called “aSvarishis” Those who do not plan for tomorrow. . They act in this world as if there was no tomorrow. They are known as seers with out agendas; they also do not scheme, nor they think of any profit while acting. From this word “Asva” a famous Yagna widely known as “Asvamedha – Horse Sacrifice” came about. “asvamedha” means “Intelligence which is applied – here and now”. Suka is a popular Hindu scriptures seer who acted without an Agenda. Recent times Shirdi Saibaba was also a Seer who acted with out an Agenda. They are also known as “Avadhutas”, “aSvarshis”. Shirdi Saibaba had a pet horse with him called “Syama” (it also means plain and simple – no tomorrow) These Seers help the world for the sake of helping. They have nothing to gain out of rendering such “aSvika” help. In case, you think you have such bent of mind, if you feel you are a plain and simple person then perhaps there is a “aSvarshi” hidden in you. Nurture that thought, get back to your root… Continue living your life as if there was no tomorrow.. It is not a wrong type of living, in Hinduism there is nothing wrong, rather it is a different type of living, that is all!.. Live everyday with out any agenda. That may confuse certain people around you. Suffice to know that you don’t have anything to do with such people who are driven by continuous agendas. Love, Madhava Turumella 29/01/2014download

 

 

Read More