Blog

17 May
0

ధీరుల ప్రవర్తన – Nature of Brave People

निन्दन्ति नीति निपुणाः यदि वा स्तुवन्ति
लक्ष्मीः समाविशतु गच्छतु वा यधॆष्टम्।
अद्यैव वा मरणमस्तु युगान्तरॆव
न्यायात् पथः प्रविचलन्ति पथं न धीराः॥
अस्मिन् सुभाषितॆ सुभाषित कारः धीराणान् व्यवहारान् वर्णितवान् अस्ति। धीराः सर्वदा अपि न्यायॆण मार्गॆण ऎव चलन्ति। तॆषां व्यवहारं द्रुष्ट्वा कॆचन निन्दन्तु। अथवा अन्यॆ कॆचन श्लाघनं वा कुर्वन्तु। तथा अपि तॆ विचलिताः न भवन्ति। तॆषां तादृश व्यवहारॆण यथॆष्टं धन संपादनं भवतु अधवा विद्यमानं धनं अपि नष्टं भवतु नाम। तथा अपि तॆ विचलिताः न भवन्ति। तादृश व्यवहारॆण तॆषां अद्यैव मरणं भवतु अधवा युगान्तरॆव मरणं भवतु तद्विषयॆपि तॆ चिन्तिता न भवन्ति। कदा अपि तॆ न्याय्यात् मार्गात् ऎकम् पदम् अपि न विचलन्ति। धीराणां वैशिष्ट्यं ऎतत्।
nindanti nIti nipuNAH yadi vA stuvanti
lakShmIH samAviSatu gacCatu vA yadhEShTam|
adyaiva vA maraNamastu yugAntarEva
nyAyAt pathaH pravicalanti pathaM na dhIrAH||
asmin suBAShitE suBAShita kAraH dhIrANAn vyavahArAn varNitavAn asti| dhIrAH sarvadA api nyayENa mArgENa Eva calanti| tEShAM vyavahAraM druShTvA kEcana nindantu| athavA anyE kEcana SlAGanaM vA kurvantu| tathA api tE vicalitAH na Bavanti| tEShAM tAdRuSa vyavahArENa yathEShTaM dhana saMpAdanaM Bavatu adhavA vidyamAnaM dhanaM api naShTaM Bavatu nAma| tathA api tE vicalitAH na Bavanti| tAdRuSa vyavahArENa tEShAM adyaiva maraNaM Bavatu adhavA yugAntarEva maraNaM Bavatu tadviShayEpi tE cintitA na Bavanti| kadA api tE nyAyyAt mArgAt Ekam padam api na vicalanti| dhIrANAM vaiSiShTyaM Etat|
English Translation to the Sanskrit explanation:
In these words of wisdom the writer is glorifying the attitude of brave and steadfast people.  Steadfast people always walk only on the righteous path.  Looking at their day to day dealings some may criticize them, and some others may praise them but they do not get disturbed by these words of abuses and prises.  They may earn good amount of money while walking on the righteous path, or they may lose what ever little money they already poses, even then they do not sway away from their chosen path.  While doing what they really wanted to do, they may attain death today or they may die after thousand years but they do not get disturbed by the thought of death… This is the attitude of brave and steadfast people.
నిన్దన్తి నీతి నిపుణాః యది వా స్తువన్తి
లక్ష్మీః సమావిశతు గచ్ఛతు వా యధెష్టమ్|
అద్యైవ వా మరణమస్తు యుగాన్తరెవ
న్యాయాత్ పథః ప్రవిచలన్తి పథం న ధీరాః||
అస్మిన్ సుభాషితె సుభాషిత కారః ధీరాణాన్ వ్యవహారాన్ వర్ణితవాన్ అస్తి| ధీరాః సర్వదా అపి న్యాయేణ మార్గేణ ఏవ చలన్తి| తెషాం వ్యవహారం ద్రుష్ట్వా కెచన నిన్దన్తు| అథవా అన్యె కేచన శ్లాఘనం వా కుర్వన్తు| తథా అపి తే విచలితాః న భవన్తి| తేషాం తాదృశ వ్యవహారేణ యథేష్టం ధన సంపాదనం భవతు అధవా విద్యమానం ధనం అపి నష్టం భవతు నామ| తథా అపి తే విచలితాః న భవన్తి| తాదృశ వ్యవహారెణ తేషాం అద్యైవ మరణం భవతు అధవా యుగాన్తరేవ మరణం భవతు తద్విషయేపి తే చిన్తితా న భవన్తి| కదా అపి తే న్యాయ్యాత్ మార్గాత్ ఏకమ్ పదమ్ అపి న విచలన్తి| ధీరాణాం వైశిష్ట్యం ఏతత్|
ఈ సుభాషితంలో సుభాషితకారుడు ధీరుల పద్ధతి గురించి పొగుడుతున్నాడు.  ధీరులు ఎల్లప్పుడూ న్యాయ మార్గంలోనే సంచరిస్తారు.  వాళ్ల వ్యవహారాలను చూసి కొంతమంది విమర్శిస్తారు, మరి కొంతమంది పొగుడుతారు. ఐనాకూడా వాళ్లు ఈ నిందాస్తుతులవల్ల చలించరు.  వాళ్లు ఎన్నుకున్న మార్గంలో వాళ్లు ధనం సంపాదించవచ్చు, లేదా ఆ ఉన్న కొద్ది ధనం గూడా తిరుక్షవరంమై నష్టపోవచ్చు.. అయినాకూడా వాళ్లు చలించరు తాము ఎన్నుకున్న మార్గాన్నుండి తప్పుకోరు.  వాళ్లకు ఇవాళ మరణం రావచ్చు లేదా వాళ్లు యుగాంతం వరకు బ్రతకచ్చు… కానీ వాళ్లు లెక్క చెయ్యరు.  ఇదీ ధీరుల పద్ధతి…

 

Read More
17 May
0

నిజమైన జ్ఞానం లక్షణం – True Knowledge

यदा किंचिज्ञॊहं गज इव मदांधः समभवम्
तदा सर्वज्ञॊस्मीत्यबव दव लिप्तं मम मनः।
यदा किंचित् किंचित् बुधजन सकाशा दवगतम्
तदा मूर्खॆस्मीति ज्वर इव मदॊमॆ व्यपगतः॥
-भर्त्रुहरि
ऎषः स्लॊकः भर्त्रुहरॆः अत्यन्तम् प्रसिद्ध्ः अस्ति। ऎतस्मिन् सुभाषितॆ विद्यायाः परिणामः यदि ऎकः किंचित् जानाति तस्त्य कदम् मदः भवति इति। यदा सः किन्तिच् पूर्णति ऎव ज्ञानम् संपादयति तदा तस्य मदं कदा व्यपगच्छति इति बहु सम्यक् वर्णितं अस्ति।
ऎतस्मिन् स्लॊकॆ ऎकः सहृदयः स्मात्मावलॊकनम् करॊति। तदा मम गजस्य इव मद्ः आसीत्। अहं सर्वज्ञ्नः मम समानः कॊपि नास्ति  इति ताद्रुशः भावः आसीत्। परन्तु यदा किन्चित् किन्चित् सज्जनानाम् सकासात् सहवासात् विचारान् ज्ञातवान् तदा सत्य विचारः ज्ञातः। ज्ञातस्य अपॆक्षया ज्ञातव्यमॆव बहु अस्तीति ज्ञातवान्। तदा ज्वरः इव मम मदः व्यपगतः। ऎवं अत्र सहृदयः चिन्तयति।
yadA kiMcij~jOhaM gaja iva madAMdhaH samaBavam
tadA sarvaj~jOsmItyabava dava liptaM mama manaH|
yadA kiMcit kiMcit budhajana sakASA davagatam
tadA mUrKEsmIti jvara iva madOmE vyapagataH||
-Bartruhari
EShaH slOkaH BartruharEH atyantam prasiddhH asti| Etasmin suBAShitE vidyAyAH pariNAmaH yadi EkaH kiMcit jAnAti tastya kadam madaH Bavati iti| yadA saH kintic pUrNati Eva j~jAnam saMpAdayati tadA tasya madaM kadA vyapagacCati iti bahu samyak varNitaM asti|
Etasmin slOkE EkaH sahRudayaH smAtmAvalOkanam karOti| tadA mama gajasya iva madH AsIt| ahaM sarvaj~jnaH mama samAnaH kOpi nAsti  iti tAdruSaH BAvaH AsIt| parantu yadA kincit kincit sajjanAnAm sakAsAt sahavAsAt vicArAn j~jAtavAn tadA satya vicAraH j~jAtaH| j~jAtasya apEkShayA j~jAtavyamEva bahu astIti j~jAtavAn| tadA jvaraH iva mama madaH vyapagataH| EvaM atra sahRudayaH cintayati|
English Translation:
People who are ignorant consider themselves as intelligent and become proud. Bhartrihari says that when I was ignorant I had become a like an intoxicated elephant, a person who thinks that he is omniscient, but when I came in the company of the intelligent, I realized I am an idiot.
English Explanation: (Translation of Sanskrit Explanation)
This saying of Bhartruhari is quite well known. In this statement of wisdom, “how a person, when knows a little knowledge, becomes arrogant and when he acquires full knowledge, how his arrogance goes away from him” is very well explained.
In this saying a knowledgeable person is doing self-introspection. Thinking that I know everything, I had become arrogant like an Elephant.  I thought there is no one equal to me in knowledge.  But when I got in to the company of knowledgeable intelligent people, I started knowing that I know nothing and there is a lot to know than what I really know! I realized had been an arrogant idiot.  My arrogance left me like a fever and I am cured of my ignorance.
యదా కించిజ్ఞొహం గజ ఇవ మదాంధః సమభవమ్
తదా సర్వజ్ఞొస్మీత్యభవ దవ లిప్తం మమ మనః|
యదా కించిత్ కించిత్ బుధజన సకాశా దవగతమ్
తదా మూర్ఖెస్మీతి జ్వర ఇవ మదొమె వ్యపగతః||
-భర్త్రుహరి
ఏషః శ్లోకః భర్త్రుహరెః అత్యన్తమ్ ప్రసిద్ధః అస్తి| ఎతస్మిన్ సుభాషితె విద్యాయాః పరిణామః యది ఎకః కించిత్ జానాతి తస్త్య కదమ్ మదః భవతి ఇతి| యదా సః కిన్తిచ్ పూర్ణతి ఎవ జ్ఞానమ్ సంపాదయతి తదా తస్య మదం కదా వ్యపగచ్ఛతి ఇతి బహు సమ్యక్ వర్ణితం అస్తి|
ఎతస్మిన్ స్లొకె ఎకః సహృదయః స్మాత్మావలొకనమ్ కరొతి| తదా మమ గజస్య ఇవ మద్ః ఆసీత్| అహం సర్వజ్ఞ్నః మమ సమానః కొపి నాస్తి  ఇతి తాద్రుశః భావః ఆసీత్| పరన్తు యదా కిన్చిత్ కిన్చిత్ సజ్జనానామ్ సకాసాత్ సహవాసాత్ విచారాన్ జ్ఞాతవాన్ తదా సత్య విచారః జ్ఞాతః| జ్ఞాతస్య అపెక్షయా జ్ఞాతవ్యమెవ బహు అస్తీతి జ్ఞాతవాన్| తదా జ్వరః ఇవ మమ మదః వ్యపగతః| ఎవం అత్ర సహృదయః చిన్తయతి|
తెలుగులో అర్ధం:
నాకు మిడిమిడి జ్ఞానం ఉన్నప్పుడు ’నాకు ఎంతో తెలుసు, నాతో సరిసమానమైన జ్ఞానం ఉన్నవాళ్లు ఈ ప్రపంచంలోనే లేరు’ అని నాకు ఒక ఏనుగుకు ఉన్నంత మదం ఉండేది.  కానీ మెల్లగా నాకు నిజమైన పండితులతో సహవాసం ఏర్పడింది… వాళ్ల సహవాసంతో నాకు తెలిసివచ్చినదేంటంటే – ’నాకు ఏమీ తెలియదని — అన్నీ తెలుసు అనుకునే ఒక మూర్ఖుడిని’ అని!  నాకు తెలియనిది ఈ ప్రపంచంలో ఎంతో వుందని అర్ధమైన  తర్వాద నా మదం జ్వరంలాగా దిగిపోయింది…

Read More
17 May
0

సజ్జనుల స్వభావం – Nature of good people

ॐ क्षारं जलम् वारिरुचं पिबंति तधॆव कृत्वां मधुरं वमन्ति।
संतस्तथा दुर्जन दुर्वचांसि पीत्वाच सूक्तानि समुद्गिरन्ति॥
अस्य सुभाषितॆ सज्जनानां स्वभावः वर्णितः अस्ति। समुद्रस्य जलं लवणं अस्ति। तत् पातुं कष्टं भवति। तथा अपि मॆघाः तत् जलं पिबंति। परंतु जनॆभ्यः वॄष्टिरूपॆण मधुरं जलमॆव वितरंति। ऎवमॆव सत्पुरुषाः दुर्जनानां दुर्वचनानि श्रुत्वा अपि दुर्वचनानि न वदंति ऎव। प्रत्थित मधुराणि वचनानि ऎव वदंति। तॆषां मुखा सर्वदा सर्वॆषां आनंद दायकानि वचनानि ऎव निस्सरन्ति। ऎतदॆव सज्जनानां वैशिष्यं।
English Transliteration:
kShAraM jalam vArirucaM pibaMti tadhEva kRutvAM madhuraM vamanti|
saMtastathA durjana durvacAMsi pItvAca sUktAni samudgiranti||
asya suBAShitE sajjanAnAM svaBAvaH varNitaH asti| samudrasya jalaM lavaNaM asti| tat pAtuM kaShTaM Bavati| tathA api mEGAH tat jalaM pibaMti| paraMtu janEByaH vRUShTirUpENa madhuraM jalamEva vitaraMti| EvamEva satpuruShAH durjanAnAM durvacanAni SrutvA api durvacanAni na vadaMti Eva| pratthita madhurANi vacanAni Eva vadaMti| tEShAM muKA sarvadA sarvEShAM AnaMda dAyakAni vacanAni Eva nissaranti| EtadEva sajjanAnAM vaiSiShyaM|
Translation:
In this words of wisdom the nature of good people is explained.  The water of the ocean is quite salty.  It is very difficult drink the salty water. Even then clouds do drink that salty water and offer back nice fresh water in the form of rain to the people.  Same way,  good people hear the abusive words spoken by the wicked people yet they speak back only nice words… [They never lose their temper or their mouth in anger]
క్షారం జలమ్ వారిరుచం పిబంతి తధేవ కృత్వాం మధురం వమన్తి|
సంతస్తథా దుర్జన దుర్వచాంసి పీత్వాచ సూక్తాని సముద్గిరన్తి||
అస్య సుభాషితే సజ్జనానాం స్వభావః వర్ణితః అస్తి| సముద్రస్య జలం లవణం అస్తి| తత్ పాతుం కష్టం భవతి| తథా అపి మేఘాః తత్ జలం పిబంతి| పరంతు జనేభ్యః వౄష్టిరూపేణ మధురం జలమేవ వితరంతి| ఏవమేవ సత్పురుషాః దుర్జనానాం దుర్వచనాని శ్రుత్వా అపి దుర్వచనాని న వదంతి ఏవ| ప్రత్థిత మధురాణి వచనాని ఏవ వదంతి| తేషాం ముఖా సర్వదా సర్వేషాం ఆనంద దాయకాని వచనాని ఏవ నిస్సరన్తి| ఏతదేవ సజ్జనానాం వైశిష్యం|
ఈ సుభాషితంలో సజ్జనుల స్వభావం వర్ణించబడింది.  సముద్రం నీరు చాలా ఉప్పగా వుంటుంది.  దానిని తాగటం చాలా కష్టం.  అయినప్పటికీ మెఘాలు ఆ ఉప్పటి నీటిని త్రాగుతాయి.  తిరిగి జగత్తుకు చక్కని మధురమైన నీటిని వర్షం రూపంలో అందజేస్తాయి.  అదేవిధంగా దుర్జనులు ఎన్ని పరుషమైన (ఉప్పటి) కఠినమైన మాటలు మాట్లాడినప్పటికీ, సజ్జనులు వాటిని వినిగూడా తిరిగి మధురమైన వాక్కులనే పలుకుతారు తప్ప పరుషమైన పదాలతో బదులివ్వరు…  [సజ్జనులు నిందావాక్యాలను విన్నాగూడా తమ మనస్తౌల్యాన్ని కోల్పోరు అని అర్ధం]

 

Read More
17 May
0

మంచివారితో స్నేహం – Friendship with good people

दूरी करॊति दुरितम् विमली करॊति
चॆतश्चिरन्तनमघं चुलिकी करॊति ।
भूतॆषु किन्च करुणां बहुली करॊति
सत्संगतिः क‍थय किं न करॊति ॥
लॊकॆ सर्वॆषाः स्नॆहिताः भवंति ऎव । किंतु सर्वॆपि उत्तमाः न भवंति । तथा अपि उत्तमानां ऎव सहवासः करणीयः इति वदन् सुभाषितकारः अय्स कारणानि वदति ।  सज्जनानाम् सहवासॆन  दॊषाः गछंति । मनः शुद्धं भवति । अन्यॆषां जंतूनां उपरि प्रीतिः भवति । सज्जनानां सहवासः अस्तिचॆत् किं किं वयं न प्राप्नुमः । अर्थात् सज्जनानां सहवासॆन वयं सर्वं प्राप्नुं शक्नुमः ।
English Transliteration:
dUrI karOti duritam vimalI karOti
cEtaScirantanamaGaM culikI karOti |
BUtEShu kinca karuNAM bahulI karOti
satsaMgatiH ka^thaya kiM na karOti ||
lOkE sarvEShAH snEhitAH BavaMti Eva | kiMtu sarvEpi uttamAH na BavaMti | tathA api uttamAnAM Eva sahavAsaH karaNIyaH iti vadan suBAShitakAraH aysa kAraNAni vadati | sajjanAnAm sahavAsEna  dOShAH gaCaMti | manaH SuddhaM Bavati | anyEShAM jaMtUnAM upari prItiH Bavati | sajjanAnAM sahavAsaH asticEt kiM kiM vayaM na prApnumaH | arthAt sajjanAnAM sahavAsEna vayaM sarvaM prApnuM SaknumaH |
Telugu Transliteration
దూరీ కరోతి దురితమ్ విమలీ కరోతి
చేతశ్చిరన్తనమఘం చులికీ కరోతి |
భూతేషు కిన్చ కరుణాం బహులీ కరోతి
సత్సంగతిః క‍థయ కిం న కరోతి ||
లోకే సర్వేషాః స్నేహితాః భవంతి ఏవ | కింతు సర్వేపి ఉత్తమాః న భవంతి | తథా అపి ఉత్తమానాం ఏవ సహవాసః కరణీయః ఇతి వదన్ సుభాషితకారః అయ్స కారణాని వదతి | సజ్జనానామ్ సహవాసేన  దోషాః గఛంతి | మనః శుద్ధం భవతి | అన్యేషాం జంతూనాం ఉపరి ప్రీతిః భవతి | సజ్జనానాం సహవాసః అస్తిచేత్ కిం కిం వయం న ప్రాప్నుమః | అర్థాత్ సజ్జనానాం సహవాసేన వయం సర్వం ప్రాప్నుం శక్నుమః |
Meaning in English:
In this world almost everyone will have friends.  But all friends are not of great qualities. Even then we must try to make friendship with people with good qualities.  Saying thus the writer of this words of wisdom giving us the following reasons in support:  Good people’s friendship will rid us of our bad qualities.  It cleanses our mind.  It helps us in developing compassion towards other beings.  If we have the company of good people what is that we can not achieve!  To conclude we must all try to make friendship with good people.
 తెలుగులో అర్థం:
లోకంలో అందరికీ స్నేహితులు ఉంటారు.  కానీ వాళ్లందరూ మంచిస్నేహితులే అయి వుండరు.  కానీ మనం అన్ని సమయాలలోనూ మంచి స్నేహితులను పొందడానికి ప్రయత్నం చెయ్యాలి.  ఈ విషయం చెబుతూ సుభాషితకారులు మంచి స్నేహితం చేస్తో వచ్చే ఫలితాలను గురించి చెబుతున్నారు.  మంచి స్నేహితం మనలోని దోషాలను తొలగిస్తుంది.  మన మనసులని నిర్మలం చేస్తుంది.  ఇతర ప్రాణికోటులపైన ప్రేమ దయ కలిగింప జేస్తుంది.  నిజానికి మంచి స్నేహితులు వుంటే మనం ఈ ప్రపంచంలో సాధించలేనిదంటూ ఏముంది?  కాబట్టి మనం ఎల్లప్పుడూ మంచి స్నేహితులను పొందడానికి ప్రయత్నం చేద్దాము..

Read More
17 May
0

విగతభీః

చిన్నప్పుడు రేపల్లెలో పెనుమూడి వద్ద ప్రతిరోజూ కృష్ణానదిలో ఈతకొట్టడానికి స్నేహితులతో కలిసి వెళ్లేవాడిని.  ఒక్కోసారి ఒంటరిగా వెళ్లేవాడిని.  నేను గజఈతగాడినని చెప్పుకోనుగానీ ఫర్లేదు బాగానే ఈదగలను.  రేపల్లెవైపు ఒడ్డున చాలా ఎక్కువమంది స్నానాలు చేస్తుండేవారు. అందుకని నేను  ఈదుకొని కృష్ణానది అటువైపున మధ్యల్లో ఉన్న ఇసుకలంకలవద్ద స్నానం చేయడానికి వెళ్లేవాడిని.  ఆ ఇసుకతిన్నెలమీదే కూర్చుని నా జపధ్యానాలు చేసుకునేవాడిని.  ఒకసారి కృష్ణమ్మ మంచి వరదలో ఉంది.  నేను మామూలుగా ఈదుకొని అటువైపు వెళ్లాను.   ఇంతలో పెద్దగా అరుపులు.  రక్షించండి రక్షించండి అని చూస్తే స్నానానికి వచ్చిన ఒక వ్యక్తి కాలుజారిపడి కొట్టుకుపోతున్నాడు.  సరే! మొత్తానికి కష్టపడి ఈదుకువెళ్లి అతడిని రక్షించి ఒడ్డుకు చేర్చాను.  మళ్లీ నేను తిరిగి స్నానానికి వెళ్లిపోయాను.  ఒక గంట తర్వాత నేను రేపల్లె ఒడ్డుకు వచ్చి నా సైకిలు తీసుకుని నడుపుకుంటూ వెళుతుంటే పెనుమూడి బస్టాండు దగ్గర చాలామంది గుమిగూడి ఉన్నారు.  ఏంటా అని వెళ్లి చూస్తే ఇందాక కృష్ణలో ప్రమాదవశాత్తూ పడి మరణించబోయినవ్యక్తి ప్రమాదవశాత్తూ రేపల్లె-పెనుమూడి బస్సుకిందపడి మరణించాడు… చావు రాసిపెట్టి ఉంటే ఎవరూ ఎక్కడా అడ్డుపడలేరు.  అందుకే బ్రతికినన్నాళ్లూ రేపనేది లేనట్లుగా బ్రతకాలి… భయపడకుండా బ్రతకాలి.  హాయిగా బ్రతకాలి…

నాకనిపించేదేంటంటే ‘భయం‘ అనేది ఒక పరదా!  దానికి అటువైపు మరణం ఉంటుంది,  ఇటువైపు ఉండేది మన ఆత్మ…. ఈ ఆత్మ ‘భయం‘ పరదాని చూసి జాగ్రత్తపడుతూంటుంది.  అయితే ఎప్పుడైతే భయంపరదాని మనం తొలగించుతామో అప్పుడు మరణంయొక్క పేలవత్వం అర్ధమవుతుంది.  అది ఎంత శుష్కమైనదో అర్ధమౌతుంది. అందుకే హైందవ ధర్మగ్రంధాలు ’మాచే వ్యధా మాచ విమూఢభావాః’ అనీ  ‘మా భీః‘ ‘భయం వదిలిపెట్టు‘ అని మరలమరల చెబుతాయి.  భయంవదిలిననాడు మనిషి జీవించిఉండగానే ‘అమరు‘డవుతాడు…  అమృతుడవుతాడు…   భయపడని ఆత్మ పక్షిలాగా స్వేచ్చగా తనదైన చిదాకాశంలో విహరిస్తుంది.  అందుకే ‘భయాన్ని వదిలిపెట్టండి‘, హాయిగా ఊపిరిపీల్చండి.  నిర్భీతిగా మీ మనసులో విషయాలను పంచుకోండి.  ప్రపంచాన్ని, మిమ్మల్ని భయపెట్టాలని చూసే అరాచకాన్ని ఎదుర్కోండి.  మరణం ఎప్పుడైనా ఎలాగైనా రావచ్చు కాబట్టి దానిగురించి ఆలోచిస్తూ దాని పరదాయైన ‘భయాన్ని‘ ఎల్లప్పుడూ చూస్తూ నిలబడకండి… జీవితాన్ని గడపండి.

-మాధవ తురుమెళ్ల, లండన్ 18/11/2012

Read More
17 May
0

PRAYERS OF OUR HINDU ANCESTORS [RAIN GOD]

Our ancestors ardently prayed to nature when they were frightened. I thought giving these prayer text to Rain God with their meanings and references would be useful to the believing minds. Even today – these prayers are chanted regularly by traditional Brahmins as a part of their sandhya ritual. I am giving below the full vedic prayer both in Sanskrit and in Telugu. Below that I gave each Rik, Sama and Yajus seperately with their referencce and English meaning. -Madhava Turumella, London 12/10/2013

prayer

Full Vedic Prayer chanted together to appease the Rain God 

इमं मे वरुण शृधीहवमध्या च मृडय। त्वामवस्यु राचके। तत्वायामि ब्रह्मणा वंदमानस्तदाशास्ते यजमानो हविर्भिः। अहेडमानो वरुणेहबोध्युरुषं समान आयुः प्रमोषीः। यछ्छिद्धिते विषो यधा प्रदेव वरुण व्रतम्। मिनीमसि द्यविद्यवि। यत्किंचेदं वरुण दैव्ये जनेभिद्रोहं मनुष्यश्चरामसि। अचित्तीयत्तव धर्मा युयोपिम मा नस्तस्मादेनसो देव रीरिषः। कितवासो यद्रिरिपुर्न दीवि यद्वाघ सत्यमुत यन्न विद्म। सर्वा ता विष्य शिथिरेव देवाथा ते स्याम वरुण प्रियसः ।

ఇమం మే వరుణ శృధీహవమధ్యా చ మృడయ| త్వామవస్యు రాచకే| తత్వాయామి బ్రహ్మణా వందమానస్తదాశాస్తే యజమానో హవిర్భిః| అహేడమానో వరుణేహబోధ్యురుషం సమాన ఆయుః ప్రమోషీః| యఛ్ఛిద్ధితే విషో యధా ప్రదేవ వరుణ వ్రతమ్| మినీమసి ద్యవిద్యవి|  యత్కించేదం వరుణ దైవ్యే జనేభిద్రోహం మనుష్యశ్చరామసి| అచిత్తీయత్తవ ధర్మా యుయోపిమ మా నస్తస్మాదేనసో దేవ రీరిషః|  కితవాసో యద్రిరిపుర్న దీవి యద్వాఘ సత్యముత యన్న విద్మ| సర్వా తా విష్య శిథిరేవ దేవాథా తే స్యామ వరుణ ప్రియసః |

इमं मे वरुण शृधीहवमध्या च मृडय। त्वामवस्यु राचके।
ఇమం మే వరుణ శృధీహవమధ్యా చ మృడయ| త్వామవస్యు రాచకే|
Imam me varuna srudhi havam. adya cha mridaya| Tvam avas yurachake|
[Rigveda 1.25.19, Samaveda 1585, Shukla Yajurveda (21.1)]

Meaning: O Varuna, please fulfil this prayer of mine and make me happy here and now. I pray for Thy protection.

तत्वायामि ब्रह्मणा वंदमानस्तदाशास्ते यजमानो हविर्भिः। अहेडमानो वरुणेहबोध्युरुषं समान आयुः प्रमोषीः।
తత్వాయామి బ్రహ్మణా వందమానస్తదాశాస్తే యజమానో హవిర్భిః| అహేడమానో వరుణేహబోధ్యురుషం సమాన ఆయుః ప్రమోషీః|
Tattva yami brahmana vandamanastadasaste Yajamano Havirbhih| Ahedamano varuneha bodhyurusam sa Ma na ayuh pramosih|
[Rigveda 1.24.11, Krishna Yujurveda 2.1.11.6, Shukla Yajurveda 18.49 & 21.2]

Meaning: I seek refuge in Thee uttering the Vedic mantras. The sacrificers seek Thee with the ingredients of offering.

यछ्छिद्धिते विषो यधा प्रदेव वरुण व्रतम्। मिनीमसि द्यविद्यवि।
యఛ్ఛిద్ధితే విషో యధా ప్రదేవ వరుణ వ్రతమ్| మినీమసి ద్యవిద్యవి|
Yacchiddhite viso yatha pradeva varuna vratam| Minimasi dyavi dyavi|
[Rigveda 1.25.1, Krishna Yajurveda 3.4.11.4]

Meaning: O famous Varuna, please accept my prayer and don’t ignore it. Please do not shorten my span of life.

यत्किंचेदं वरुण दैव्ये जनेभिद्रोहं मनुष्यश्चरामसि। अचित्तीयत्तव धर्मा युयोपिम मा नस्तस्मादेनसो देव रीरिषः।
యత్కించేదం వరుణ దైవ్యే జనేభిద్రోహం మనుష్యశ్చరామసి| అచిత్తీయత్తవ ధర్మా యుయోపిమ మా నస్తస్మాదేనసో దేవ రీరిషః|
Yatkinchedam varuna daivye jane abhidroham Manusyascharamasi| Achittiyattava dharma yu yopima Ma nastasmadenaso deva ririsah|
[Rigveda 7.89.5, Atharva veda 6.51.3, Krishna Yajurveda 3.4.11.6]

Meaning: O Lord Varuna, Please protect us without punishing us for sins committed by us in different ways – by omitng to perform daily. Thy worship like the ignorant folk, by committing frauds on the celestials because of human ignorance or by infringing the path of righteousness laid down by you.

कितवासो यद्रिरिपुर्न दीवि यद्वाघ सत्यमुत यन्न विद्म। सर्वा ता विष्य शिथिरेव देवाथा ते स्याम वरुण प्रियसः ।
కితవాసో యద్రిరిపుర్న దీవి యద్వాఘ సత్యముత యన్న విద్మ| సర్వా తా విష్య శిథిరేవ దేవాథా తే స్యామ వరుణ ప్రియసః |
Kitavaso yadriripurna divi yadvagha satyamuta Yanna vidma| Sarva ta visya sithireva devatha te Syama varuna priyasah|
[Rigveda 5.85.8, Krishna Yajurveda 3.4.11.6]

Meaning: O Varuna, please expunge the sin like those attributed to me unjustly by wicked people like gamblers who go where the good do not go or the sins committed by me consciously or unconsciously. We must ever remain beloved of you.

Read More
17 May
0

మానవులు జంతువులు స్వలింగ సంపర్కం — నా ఆలోచన

మానవులు జంతువులు స్వలింగ సంపర్కం — నా ఆలోచన [… ఇక్కడనేను రాయబోతున్న కొన్ని వాక్యాలు కొంచెం జగుప్సాకరంగా అనిపించచ్చు. కానీ సంధర్బాన్ని బట్టి రాయకతప్పడంలేదు. మీకు మనస్తాపంకలిగించిఉంటే ముందస్తుగా క్షమాపణ చెప్పుకుంటున్నాను. – మీ మాధవ తురుమెళ్ల]

ఆకలి, నిద్ర, భయపడటం, మైధునక్రియపట్ల ఆసక్తి ఇవి జంతువులకు మనుషులకు సహజలక్షణాలు. ఆకలి అందరికీ వేస్తుంది, నిద్ర అందరికీ వస్తుంది, ప్రతి జీవిలోనూ భయం ఉంటుంది, అలాగే ప్రతిజీవికీ కామపు కోరిక ఉంటుంది. జీవి అనేవాడు (ఆత్మ స్వరూపి) ఈ నాలుగింటివల్ల సంసారం అనే సాలెగూటిలో చిక్కుకున్నాడు అని వేదాంతం అంటుంది. ఎంత కాదనుకున్నా ఆకలికి దూరంగా, నిద్రకిదూరంగా ఉండలేముగదా! ఎందుకని? ఈ నాలిగింటియొక్క రహస్యాన్ని తెలుసుకుంటే జీవుడు ఎలా బంధింపబడ్డాడో అనేది తెలుస్తుంది అని మన ఋషుల ఆలోచన. అందుకే ఆహారానికి వ్యతిరేకంగా ఉపవాసం ఉండటం, నిద్రకి వ్యతిరేకంగా శివరాత్రి వంటి పర్వదినాలలో జాగారం చెయ్యడం, భయపడటానికి వ్యతిరేకంగా సాహసకార్యక్రమాలలో పాల్గొనడం, కామానికి వ్యతిరేకంగా బ్రహ్మచర్యం చెయ్యడం చేస్తారు. ఉపవాసకు, జాగారము, సాహసము, బ్రహ్మచర్యము గొప్ప తపస్సులుగా అందుకే కీర్తించబడ్డాయి.

హైందవ ఋషుల ఆలోచన ఏంటంటే ఈ నాలుగింటినీ ఏ జీవి వ్యక్తీకరించినా అది తప్పుకాదు – అది శిక్షార్హమైన నేరమూగాదు. అయితే జంతుప్రవృత్తిపట్ల వారికి ఉన్న జాలి సానుభూతి అక్కడితో ఆగిపోయాయి.

ఆకలి వేసిందిగదా అని పక్కవాడి చేతిలో ఉన్నది లాక్కుని తినెయ్యము ఎందుకని?! ఎందుకంటే ఏది మనదో దేనిని మనం ధర్మంగా సంపాదించామో లేదా దేనిని అనుభవించడానికి మనకు తోటి సమాజం అనుమతిని అందజేసిందో దానినే మనం అనుభవిస్తాము. దీనినే ‘సంస్కారం‘ అని పిలుస్తాము. అంటే మనం ఆహారనిద్రాభయమైధునాదులలో జంతువులతో సమానమైనా మనలోని ‘సంస్కారం‘ మనని వాటినుండి వేరుచేస్తుంది. ఈ సంస్కారం అనేది వాసనాగతంగా వస్తే బుద్ధి వాటిని అమలులో పెడుతుంది కాబట్టి మనలను బుద్ధిజీవులు అన్నారు. అన్నంతినాలన్న కోరిక పుట్టినప్పుడు ఏది తినదగినదో దానినే తింటాము అంతేగానీ పెంటను తినంగదా?! కుక్కలు పందులు ఇత్యాది జంతువులు స్వంత తల్లితోటి చెల్లితోటి రమిస్తాయి. అవి జంతువులు వాటిని గమనించిన మనం వాటిపట్ల అసహ్యాన్ని పెంచుకోము. కానీ అదే తోటి మానవుడు అటువంటి వావివరసలులేని కోరిక వ్యక్తపరిస్తే అట్లాంటికోరిక తీర్చుకోవడానికి ప్రయత్నిస్తే మనం తీవ్రంగా ఖండిస్తాము, తిరస్కరిస్తాము. అంటే కామపుకోరిక కలిగిందిగదా అని ఏది సంస్కారవంతమో దానివల్లే కోరిక తీర్చుకుంటాము అంతేగానీ సంస్కారహీనంగా జంతువుల్లా ప్రవర్తించముగదా?! బ్రహ్మదేవునికి తన కూతురిపై కామపు కోరిక కలిగిందట దాంతో శివునికి ఆగ్రహాన్ని కలిగించినవాడయాడు. శివునితో శిక్షించబడ్డాడు. అదే మృగశిరారాశికి చెందిన కధగా మనకు పరిచయం.

కానీ ఇవాల్టి సమాజం మానవులని జంతువుల్లా ప్రవర్తించమనే ప్రోత్సహిస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఆకలివేసింది కాబట్టి దేన్నిబడితే దాన్ని ఎలాబడితే అలా తినెయ్యమని అనుమతించితే నరమాంసభక్షణని ఎందుకు అనుమతించగూడదు?! అలాగే కామం కోరిక తీర్చుకోవాలిగాబట్టి ఆడామగా తేడాలేకుండా ఎవరుబడితేవారు ఎక్కడబడితే అక్కడ కామపుకోరిక వ్యక్తపరుచుకోవడం తీర్చుకోవడం చెయ్యండి అని అనుమతిస్తే మరి బలాత్కారానికి వ్యతిరేకంగా చట్టాలు చెయ్యడం దేనికి?! మనం ఎంత జంతువులమయినా మన సంస్కారాన్ని మనం మరిచిపోవడం లేదా అసలు సంస్కారం అనేదేలేదనే వాదన చెయ్యడం మంచిదిగాదు. దీనివల్ల సమాజం విలువలుకోల్పోయి అధోగతి పాలవుతుంది. ధర్మచక్రం గాడితప్పుతుంది …

వ్యక్తిగతంగా స్వలింగసంపర్కం నేరం అనే విషయాన్ని నేను ఒప్పుకోను. ఎందుకంటే జంతువులలో వావివరసలు లేకుండా రమించడం, అలాగే స్వలింగసంపర్కానికి పాల్పడడం సహజం. మనం జంతువులను శిక్షించము. కానీ మానవులు జంతువులుగాదు – జంతువులుగా అనిపించేవాటిలోనే అధికులు! ‘జంతూనాం నరజన్మదుర్లభం‘ జంతువుల్లో మనిషిగా పుట్టడం చాలా దుర్లభం అని అందుకే అన్నారు. అందువల్ల సంస్కారం అనేదాన్ని తుంగలో తొక్కి స్వలింగ సంపర్కం చేస్తాము అంటే చేసుకోండి… ఎవరుకాదంటారు?! కానీ మీ జంతుత్వాన్ని ఒప్పుకొమ్మనీ దానిని సమర్ధించమని మీరు నినాదాలుచేసి తోటివారిపై వత్తిడితేవడం భావ్యంగాదని మనవిచేస్తున్నాను.

అసలు సంస్కారాన్ని వదిలేస్తే జంతువులలాగా ఎక్కడబడితే అక్కడ పెంటకు వెళ్లచ్చు, అలాగే ఎక్కడబడితే అక్కడ ఉచ్చపొయ్యచ్చు. అలాగే ఎక్కడబడితే అక్కడ దేనినిబడితే దాన్ని తినచ్చు. అలాగే ఎవరితోబడితే వారితో రమించచ్చు…. మనం వెసుకోవాల్సిన ప్రశ్నల్లా ఈ జంతుప్రవర్తన ఎక్కడితో ఆగుతుంది అని?! దీనికి హద్దేంటి అని?…. మనముందున్న ప్రశ్న నేను మనిషిలా బ్రతకాలనుకుంటున్నానా జంతువులా బ్రతకాలనుకుంటున్నానా అని….

ఇకపోతే కొందరు హిందుధర్మగురువులు హరిహరుల సంగమాన్ని అయ్యప్ప జననాన్ని ఉదాహరణచెప్పి స్వలింగసంపర్కాన్ని హైందవమతం వ్యతిరేకించలేదు అని అపప్రచారం చేస్తున్నారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. హైందవమతం పునర్జన్మను నమ్ముతుంది. ఒక జన్మలోని స్త్రీ మరొక జన్మలో పూర్తిగా పురుషునిగా మారచ్చు, ఒక జన్మలోని పురుషుడు మరొక జన్మలో పూర్తిగా స్త్రీగానూ మారచ్చు….శ్రీహరి మోహిని అవతారం ఎత్తి పూర్తిగా అతిలోకమోహన స్త్రీగా మారినట్లుగా మనకు తెలుస్తోంది. కాబట్టి అది స్వలింగసంపర్కం కాదు.

ఇకపోతే స్వలింగసంపర్కులు ఈ క్రింద ఇస్తున్న శ్లోకాన్ని ఎడాపెడా అన్నిచోట్లా ఉటంకిస్తూ హైందవధర్మంలో మిత్ర వరుణ అనేవారు స్వలింగ సంపర్కులనీ వారికి పుట్టినవారే వశిష్టుడు అగస్త్యుడు అని చెబుతారు. భాగవతంలోని ఈ శ్లోకానికి స్వలింగసంపర్కులుచేసేది ఖచ్చితంగా అనుచితమైన వ్యాఖ్య!

రేతః సిశిచతుః కుంభే ఊర్వశ్యాః సన్నిధౌ దృతం
రేవత్యాం మిత్ర ఉత్సర్గం అరిష్టం పిప్పలం వ్యధాత్! భాగవతం 6.18.6

ఊర్వశిని చూడగానే [మిత్రావరుణులలో] కామపూరితమైన కోరిక కలిగింది వారిద్దరూ రేతాన్ని స్ఖలించారు. ఆ రేతస్సును కుండలో పెట్టారు. మిత్రునికి తన భార్య రేవతిద్వారా ఉత్సర్గ, అరిష్ట మరియు పిప్పల అనే బిడ్డలు పుట్టారు.

వివరంగా చూస్తే మిత్రుడు వరుణుడు ఇద్దరూ స్నేహితులు మగవారు. ఇద్దరికీ ఊర్వశి కనబడింది. ఊర్వశి చాలా అందంగా అవయవ సౌష్టవంతో చనుబిగువులతో ఆకర్షణీయంగా ఉన్నది. ఇద్దరూ మగవారే కానీ ఆ దేవవేశ్యను చూసి మనసుపడ్డారు. ఇద్దరికీ ఊర్వశిని చూడగానే ఆ కామంలో రేతఃస్కలనం అయింది. —- ఇక్కడ ఒక్కక్షణం ఆగి పరిశీలనగా ఈ శ్లోకం చదవండి…. స్వలింగ సంపర్కులంటే మగవారిపట్ల మగవారు అలాగే ఆడవారిపట్ల ఆడవారు ఆకర్షితులవడం. మరి ఈ సందర్భంలో మిత్రుడు వరుణుడు ఇద్దరూ మగవారే కాబట్టి వారు ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులైతే దాన్ని మనం స్వలింగ సంపర్కంగా పరిగణించవచ్చు. కానీ ఇద్దరూ ఒకే ఆడదానిపట్ల ఆకర్షితులయారు. అది సహజమేగదా! వారి రేతస్సును ’కుంభం’లో నిక్షిప్తం చేసారు అని ఉంది. ’కుంభం’ అంటే మట్టికుండ అని సామాన్యార్ధం కానీ మానవదేహంగూడా మట్టితోచెయ్యబడ్డదే! ఆవిధంగా చూస్తే స్త్రీ యోనిని [రేతస్సును భద్రపరచగల / నిక్షిప్తం చెయ్యగల మట్టితోచెయ్యబడ్డ] కుంభం అనచ్చు. యోని అనకుండా కుంభం అని ఉండచ్చు. ఆవిధంగా చూస్తే బహుశా మిత్రుడు వరుణుడు కలిసి ఊర్వశితో ఒకేసారి రమించి ఉండచ్చు. అగస్త్యుడు వశిష్టుడు ఇద్దరూ ఊర్వశికి పుట్టిన బిడ్డలుగా మనకు తెలుస్తోంది. కానీ వారి తండ్రి మిత్రావరుణులు – ఇద్దరూ అయుండచ్చు. బహుశా డిఎన్‍ఎ పరీక్షల్లో ఎవరికి ఎవరు నిజంగా పుట్టారో తెలిసి ఉండేది. కానీ మిత్రుడికి వరుణుడికీ వారు మనసుపడి రమించిన ఊర్వశికి ఆ సంశయం రాలేదు. అందువల్ల పుట్టిన బిడ్డలకు తండ్రి ఎవరు అంటే – ఇద్దరు తండ్రులు అని చెప్పడం జరిగింది.

మరి ఈ కధనంలో స్వలింగసంపర్కానికి తావెక్కడ?! ఇలా ఈ శ్లోకాన్ని స్వలింగ సంపర్కులు తమ కక్కుర్తికోసం వాడుకోవడం ఇంతకంటే అన్యాయం ఇంకొకటి ఉందా?! ఇకపోతే అదేశ్లోకంలో మిత్రుడి భార్య రేవతి అతడి బిడ్డల ప్రసక్తి ఉంది. కాబట్టి స్పష్టంగా ఈ ఇద్దరు మగవారు మిత్రావరుణులు ఆడవారిపట్ల ఆకర్షితులయారేగానీ వారు స్వలింగ సంపర్కులు కాదు.

ఈ నా నలభైఆరేండ్ల జీవితంలో నేను నాలుగువేదాలు చదివాను, రామాయణ భారతేతిహాసాలు చదివాను. అష్టాదశపురాణాలు ఉపనిషత్తులు అలాగే చిన్నా చితాకా ధర్మగ్రంధాలుగా చెప్పబడ్డ అనేక పుస్తకాలను చదివాను. ఎక్కడా ఏ గ్రంధంలోనూ స్వలింగసంపర్కాన్ని గూర్చిన చర్చలేదు అని నేను ఘంటాపధంగా చెప్పగలను.

కామాన్ని గురించి చర్చించిన శాస్త్రాలలో హైందవ వివాహమే ఒక గొప్ప దిశానిర్దేశాన్ని చేస్తోంది. రజస్వల అయిన ఆడపిల్లను కన్య అనిపిలుస్తారు. అటువంటి కన్యను మగవాడు కోరుకుంటాడు. ఆడమగ అనేది ఇక్కడ స్పష్టం. హైందవధర్మంలో వివాహం చాలా స్పష్టమైన నిర్దేశాన్నికలిగి ఉంది. శుక్రశోణితాల కలయికకోసం ధర్మపరమైన బిడ్డలకు సహజసిద్ధంగా జన్మనివ్వడంకోసం (ధర్మప్రజాసిద్యర్ధం) తల్లి పూర్వరూపంగా తండ్రి ఉత్తరరూపంగా బిడ్డలే సంధిగా వారుపాల్గొనే సృష్టికార్యమే సంధానంగా (మాతా పూర్వరూపం పితోత్తరరూపం ప్రజా సంధిః ప్రజనగ్‍ం సంధానం -యజుర్వేదం) హైందవ వివాహవ్యవస్థ ఏర్పడినట్లుగా మనకు తెలుస్తోంది.

నిజానికి ఆధునిక కాలంలోని తల్లితండ్రులు పాశ్చాత్యసంస్కృతిని పాటించి తమలోని కామపుకోరికను తీర్చుకోవడంకోసం తమకు పుట్టిన పిల్లలను దూరంగా ఎక్కడో గదుల్లో పడుకోబెట్టేస్తున్నారు. ఆ పసిమనసుల్లోని భయాలకు అంతులేదు. తల్లి తండ్రి ఆడమగ అనే భేదాన్ని సృష్టికార్యాన్నిగురించిన అపోహను పెంచుకున్న పసిమనసుల్లో తమలోని భయాన్ని పోగొట్టుకోవడానికి తల్లికి తండ్రి తోడుగా ఉన్నట్లే తమకుతోడుగా రాత్రి ఎవరూ లేక తమకుతామే తోడనుకుని స్వలింగసంపర్కంపట్ల ఊహలు పెంచుకుంటున్నట్లుగా తాము పెద్దవారయిన తర్వాత స్వలింగసంపర్కులుగా మారుతున్నట్లుగా పరిశోధనల్లో తెలుస్తోంది. దీనిపట్ల మరింత పరిశోధన అవసరం.

స్వలింగ సంపర్కం అనేది ఈ పైన చెయ్యబడ్డ నిర్దేశానికి పూర్తిగా వ్యతిరేకం. కాబట్టి అటువంటిదానిని ఏ హిందూ ధర్మగురువూ సమర్ధించగూడదు. జంతువులు నేరం చెయ్యలేవు. అలాగే కొంతమంది మనుషులుగూడా నేరం చెయ్యలేరు. కాబట్టి అది నేరంగాదు కానీ దానికి పూర్తి అనుమతి అడగడం పైగా ధర్మగురువులు దాన్ని సమర్ధించడం సమాజంలో నశించిపోతున్న విలువలకు సూచనగా భావిస్తాను. ఓం స్వస్తి – మాధవ తురుమెళ్ల

Read More
17 May
0

నా ఆలోచన: Ego (ahankar) అహంకారం

ఎడారిలో చిక్కుకున్నవాడు తన ఒంటెను వదిలిపెట్టెయ్యడమంత తెలివితక్కువ పని ఇంకొకటి లేదు. అలాగే సంసారం అనే ఎడారిలో చిక్కుకున్నవాడు తన ఆసరాగా ఉన్న అహంకారం అనే ఒంటెను, అసలు అది ఎందుకుంది, జీవితంలో దాని అవసరం ఏంటి అనేది తెలుసుకోకుండా వదలడం మంచిదిగాదు. అహంకారం అనేది చాలా అవసరం. అది భగవంతుని అష్టప్రకృతిలలో ఒకటి. నిజానికి నాకు అనిపించేదేంటంటే భారతవేదాంతంలో ‘అహంకారం‘ అనే పదం చాలా అపార్ధం చేసుకోబడింది. ‘నీకు చాలా అహంకారం‘, ‘వాడికి చాలా అహంకారం‘ అని అహంకారం అనే పదాన్ని ఎదుటివారిని విమర్శించడానికి చాలా తేలికగా వాడేస్తారు. ఈ సృష్టిలో ఏదైనా ఉంది అంటే దానికి ఒక అవసరం ఒక కారణం రెండూ ఉండి తీరతాయి. మనకి ఒక వస్తువు/వ్యక్తి/పరిస్థితి యొక్క అవసరం దాని కారణం ఇవాళ తెలియకపోవచ్చు. కానీ భగవంతుని సృష్టిలో ఏదీ వ్యర్ధంకాదు. అందుకని అహంకారానికిగూడా ఒక కారణం ఉంది. అహంకారం ఒక ఉపకరణం. అది ఒక వాహనం. అది ఒక ఎడారి ఒంటె దాన్ని సరిగా వాడి తరించడానికి తప్పించుకోవడానికి ప్రయత్నించడం అవసరం. అంతేకానీ తెలిసీ తెలియకుండా అహంకారాన్ని అణగదొక్కుదామని చూస్తే మీరు మానసికంగా బలహీనులవుతారు. ఎదుటివారు మిమ్మల్ని తమ స్వార్ధంకోసం పావుల్లా వాడుకుంటారు. అహంకారాన్ని అర్ధం చేసుకోకుండా అణగదొక్కడం వల్ల మీలో మీకే తెలియని ఒక విషాదం వస్తుంది. మీలో తితిక్ష లోపిస్తుంది. రాత్రి సుబ్బారావుగా నిద్రపోయిన వ్యక్తి ఉదహం సుబ్బారావుగా నిద్రలేవడానికి కారణమే అహంకారం! అదిలేనినాడు వ్యక్తికి వ్యక్తిత్వం లేకుండాపోతుంది.

అందుకే అన్నారు “కామిగానివాడు మోక్షగామిగాడు” అని అహంలేనినాడు ఏ కోరికా లేదు. కోరికకు మంచి చెడ్డ అనేవి లేవు… సన్యాసం తీసుకోవాలన్నకోరికగూడా వదలగలిగినవాడే నిజమైన సన్యాసి అన్నారు. సమో’హం’ (ఇందులోని అహం ని గుర్తించండి) సర్వభూతేషు నమే ద్యేష్యోస్తి నప్రియ:… అహం మనకు కనబడకపోయినా జీవభావాన్ని అదే నడిపిస్తోంది. వదిలామనుకున్న మహామహులే దాని వలలో చిక్కుకున్నారు. రైల్లో కూర్చుని ప్రయాణం చేసేవాడు తాను ప్రయాణిస్తున్నాను అనుకుంటాడు. కానీ నిజానికి అతడు కదులుతున్నాడా పరిగెత్తుతున్నాడా? రైలు పరిగెత్తుతోంది అతడు దాంట్లో కూర్చుని ఉన్నాడు.

మనిషికి అహంకారం వల్లే జీవనం… తెలుసుకోండి… అహంకారం వదలడం అనేది ఒక పరిపక్వత. మీరు అహంకారాన్ని వదలలేరు అదే మిమ్మల్ని వదులుతుంది. ‘ఉర్వారుకం ఇవ‘ పండిన దోసపండు ఎలాగైతే తీగనుండి విడివడుతుందో అలా మీరు తరించిననాడు మీ అహంకారం మిమ్మల్ని వదులుతుంది. ఆరొజుకోసం తెలివిగా ప్రణాలిక వేసుకోండి.
ధ్యానంతో కూడిన మీ అహంకారపూరిత జీవనాన్ని సాగించండి. తరించండి. -మాధవ తురుమెళ్ల

It is not wise for a person who is stranded in a desert to let go his camel. Same way a person who is stranded in this world should not let go his Ego with out first knowing what it is and why it is there! You must be able to use your ego for the right purposes. I think Ego (ahankar) is the mostly misunderstood and widely misquoted term In Indian philosophy (vedanta). It is essential to understand that nothing in this God created world is useless. Everything has a purpose and a meaning. Purpose of a person/thing/event may not be evident today but suffice to understand that if something is there then there is a purpose and meaning behind it. Similarly Ego has a purpose. Gita says that Ego is one of the eight primal energies (Astaprakriti) of God. [Gita 7.4]. I think Ego is an instrument; it is a vehicle; it is a desert camel. It is essential you must use it for the right purpose and transcend your life. People who suppress their Ego with out knowing Ego’s purpose become mentally weak. They get unstable in their life. They get abused by the people with ulterior motives. Ultimately they become a failure in life. A Subbarao who went to sleep wakes up as Subbarao only because of the Ego. It gives identity to your life. Consider that when you don’t have Ego then you become confused being. Man finds his livelihood only because of his Ego. It is considered maturity when you let go your Ego. But I think, In fact, you can’t let go your Ego. On the contrary – I think – when time comes your Ego lets you go! Just like a creeper automatically lets go of it’s ripened Cucumber Ego lets you go! Plan for that day when your Ego lets you go. Till then meditatively live your life with the help of your Ego.

Through
the Body (B), Mind (M), Intellect (I)
the Perceiver (P), Feeler (F), Thinker (T)
becomes enmeshed in the world of
Objects (O), Emotions (E) and Thoughts (T)

But when we transcend our
Vasanas (V)
we realize our true Self
OM
the Supreme Reality

Ashta Prakriti is behind the BMI chart. If BMI were a body of a vehicle which is trying to reach its destination called “OM” then Ego is like tires to the total BMI. Ego carries the BMI towards Om… Also where there is no destination to reach you don’t need tires. During the bilissful awareness “YOU ARE THAT” Ego drops you like a cucumber is dropped by its creeper.

So without ego there is also no spiritual journey. It is finally aatma decides when to leave the ego and move towards OM..

Naayam Atma pravachano Labyah.
Na Medhaya Na Bahuna scrutena.
Yam eva esha vrunute tena labhyah.
Tasya Esha Atma vivrunute tanum swam. kathopanishad (1.2.23) and also in [Mundaka 3.2.3]

The atma cannot be logically deduced or read about or heard about. It reveals itself to the one who who earnestly and worshipfully seeks it.

So then what is it that we are doing?! Is all our Sadhana a waste? NO you need to have Ego to hold you in a certain place in sadhana. And when the time comes when HE (Atman) chooses to reveal itself – your Ego drops you like a creeper drops its Cucumber [such a sadhaka though appears like attached to the world – he is detached because his Ego dropped him – Atma has chosen HIM – he becomes his natural self – this is called parambhavaatmikata]

In Kathopanishad next verse describes the qualities of the person who is fit to receivethe revelation of the Self.

navirato duscharitannaashaanto naasamaahitah |
naashaantamaanaso va’pi prajnaanenainamaashnuyaat (Katha 1.2.24)

One who has not given up those actions which are prohibited by the shastras, who senses are not controlled, whose mind is in turmoil or even though disciplined still lusts after material objects cannot know this self. i.e. A hypocrite can not know the self.

But one who only does that which is commanded by the shastras, whose mind
and senses are completely controlled and has turned away from material
things will certainly come to know the true Self.

The very same verse appears in Mundaka Upanishad 3.2.3. And just like in Katha the following verse in Mundaka qualifies the person to receive that Grace.

“Nāyam ātmā bala-hīnena labhyo” [Mundaka 3.2.4] This Atman is not available to someone who is weak.

Mental and Intellectual weakness happens only when you do not have a proper ego. You need to have proper construction before you decide upon destruction. Thou shall be strong. This being strong “bala” is only possible with the help of Ego.

The mahavakya ‘ahaM brahma asmi’ also has aham in it. We know it is there but we can’t quantify it. We only see the force of it. -Madhava Turumella

[Notes from my meditations on Gita 7.4]

Read More
17 May
0

చదువుకున్నవాడికంటే చాకలివాడు ఎలా నయం? – కధ!

చదువుకున్నవాడికంటే చాకలివాడు ఎలా నయం? – కధ!

ఒకసారి ఒక గ్రామంలో పండితులు, తర్కశాస్త్రజ్ఞులు, మీమాంసకులు ఇలా అందరూ కలిసి ఓ ఇంటి అరుగుమీద సభ జరుపుకుంటున్నారు. అటుజరిగి ఇటుజరిగి వాళ్ల చర్చ ‘వైకుంఠం ఎక్కడ ఎంతదూరంలో ఉండి ఉంటుంది?‘ అనే విషయంవైపు జరిగింది. ఒక పండితుడేమో వైకుంఠం కొన్నివేలకోట్ల ఖగోళాలకు అవతల నిజంగా ఉన్న ఒక పాలసముద్రంలో ఉన్నదన్నాడు, తార్కికుడేమో అలాగాదు చంద్రుడు లక్ష్మీదేవితోపాటే పుట్టాడు ఆయనని మనం రోజూ చూడగలుగుతున్నాము. తన అక్క లక్ష్మీదేవికి దూరంగా చంద్రుడు ఉండడు కాబట్టి వైకుంఠం ఎక్కడో చంద్రమండలానికి అవతలవైపు ఉండచ్చు అని తార్కికంగా చెప్పాడు.

అదే గ్రామంలో ఒక చాకలివ్యక్తి నివసిస్తున్నాడు. అతడు తన బట్టలను తీసుకుని చెరువుకుపోతూ ఈ పండితులనందరినీ గమనించాడు. తనదారిన తాను వెళ్లిపోయాడు. సాయంత్రం అతడు తిరిగి వస్తూ ఆ పండితులు ఇంకా గట్టిగావాదించుకుంటూనే ఉండడం గమనించాడు. ‘ఈ పండితులు ఉదయంనుండీ సాయంత్రందాకా ఏం వాదించుకుంటున్నారా!‘ అని సందేహం వచ్చి వాళ్లని వెళ్లి కారణం అడిగాడు. వాళ్లు ‘మేం వైకుంఠం ఎక్కడఉందో వాదించుకుంటున్నాము‘ అంటే అతడు తలగుడ్డతీసి తన తలగోక్కుని. ‘ఇంతమాత్రం దానికి ఉదయంనుండి సాయంత్రం దాకా వాదించుకోవాలా బాబయ్యా?!‘ అని ఆశ్చర్యంగా ఆడిగాడు. దాంతో ఈ సారి ఆశ్చర్యపోవడం ఆ పండితుల వంతయింది. “అంటే ఏంటి?! నీకు వైకుంఠం ఎక్కడుందో తెలుసా?! ఇంత చదువుకున్నాము మాకే తెలియని అతి సూక్ష్మమైన ఈ శాస్త్ర రహస్యం నీకెలా తెలుస్తుంది… పో పో నీ పనిచేసుకో…” అని ఈసడింపుగా పలికారు. “అయ్యా! నేను తమరంత చదువుకోలేదండీ. కానీ నాకు వైకుంఠం ఎక్కడుందో చూచాయగా తెలుసండీ… నేను మా పంతులోరు మొన్నీమధ్య బాగోతం (భాగవతం) చెబుతాఉంటే ఇన్నానండీ బాబయ్య! మా పంతులోరు చెప్పారు ఆ ఏనుగు (గజేంద్రుడు) ప్రాణంబుల్ ఠావుల్ దప్పె మూర్చవచ్చె… అని మరంత మూర్చవచ్చే పరిస్థితుల్లో మాటలే రావు గదా బాబయ్యా. మనం చావబోయె మనిషి చెప్పేమాటలు వినాలంటే నోటిదగ్గర చెవిబెడితే గానీ వినబడవు గదా బాబయ్యా! మరి ఆ ఏనుగు చాలా బలహీనంగా అరిచిందిగదా… ‘రావే ఈశ్వరా… రావే వరదా…. రావే గోవిందా…‘ అని అయినాగూడా ఆ ఏనుగు మాటలు ఆ వైకుంఠయ్యకు వినపడ్డాయి అంటే బహుశా ఆ వైకుంఠం ఇక్కడే ఎక్కడో మహా అయితే ఓ నాలుగిళ్ల అవతల ఉండుంటుందండీ‘ అని చెప్పి తనదారిన తాను వెళ్లిపోయాడు. ఎన్నో శాస్త్రాలను అభ్యసించి వైకుంఠం ఎక్కడ ఉందో తెలియని చదువుకున్న పండితులకంటే, ‘తన పంతులయ్య చెప్పిన భక్తి వెనుక తనదైన నమ్మకం పెట్టుకుని వైకుంఠం మా ఇంటిపక్కనే ఎక్కడో ఉంది అని తార్కికంగా సమాధానపడి తన రోజువారీ పని (కర్మయోగం) చేసుకుంటున్న చాకలివాడు కొన్ని లక్షలరెట్ల నయం‘ అని అప్పట్నించీ ‘చదువుకున్నవానికంటే చాకలివాడు నయం‘ అన్న నానుడి పుట్టింది. -మాధవ తురుమెళ్ల

Read More
17 May
0

సుభాషితం: దైవఘటన

పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే ! సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణామ్||అధిష్ఠానం తథా కర్తా కరణం చ పృథగ్విధమ్ ! వివిధాశ్చ పృథక్ చేష్టా దైవం చైవాత్ర పంచమమ్ !! శరీరవాజ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః ! న్యాయ్యం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః !! భగవద్గీత 18: 13,14,15

అర్జునా ! సర్వకర్మలసిద్ధికి ఐదు కారణములున్నాయంటూ కర్మలను అంతముచేయు ఉపాయాలని తెలుపే సాంఖ్యశాస్త్రంలో పేర్కొనబడ్డాయి. వీటి గురించి చెబుతాను విను… కర్మల సిద్ధియందు అధిష్ఠానమగు దేహము , పనిచేసేవ్యక్తి (కర్త), వివిధములైన జ్ఞానేంద్రియకర్మేంద్రియాలు, నానావిధమైన చేష్టలు (కర్మలు)…. కానీ ’దైవము’ అనునది అక్కడ ఐదవ కారణం.. మానవుడు మనోవాక్కాయములచే ఆచరించు శాస్త్రానుకూలమైన లేక శాస్త్ర విరుద్ధమైన విపరీతమైన యేకర్మలైనాసరే ఈ యైదిటి కారణంగానే నడుస్తాయి!

ఇందులో ’దైవం చైవాత్ర పంచమం’ అంటే ’Fifth Element’ అనేదాన్ని మన హైందవ పూర్వీకులు విపరీతంగా నమ్మేవారు. ఇదుగో మనం చేసే పూజలన్నీ ఈ ’దైవానికే’ — ఈ దేవుని ఇచ్చనే ’భగవదేఛ్ఛ’ అంటాము… మనకు అనుకూలంగా (న్యాయంవా) లేదా ప్రతికూలంగా (విపరీతంవా) జరిగే సంఘటనలన్నింటి వెనుకా ’దైవం చైవ అత్ర పంచమం’ ఇది తెలుసుకుని నడుచుకోగలిగిన మానవుడు చీకూచింతాలేకుండా నిర్భయంగా ప్రవర్తించగలుగుతాడు. జీవితాన్ని అనుభవించగలుగుతాడు అని మనకు ఋషులు బోధించారు.

జీవితంలో మనందరికీగూడా అనేక ఘటనలు ఎదురవుతుంటాయి. కొన్ని మంచి కొన్ని చెడు… ఒక్కోసారి అవి తీవ్రమైన బాధని కలిగిస్తాయి, భగవంతుని పట్ల మన విశ్వాసాన్ని శంకించేటట్లు చేస్తాయి. అదిగో అప్పుడే నిజమైన విశ్వాసానికి పరీక్ష.

ఉదాహరణగా నిజంగా జరిగిన ఒక సంఘటనగూర్చి చెబుతాను… నాకు అతి దగ్గరగా తెలిసిన వ్యక్తికి 2000 సంవత్సరంలో జర్మనీనుండి, అమెరికానుండి రెండు దేశాలనుండి ఒకేసారి ఉద్యోగావకాశాలు వచ్చాయి. అతడు అమెరికా వెళ్లాలనుకున్నాడు. అమెరికా ఉద్యోగం వీసాకోసం చెన్నైలో అప్లికేషన్ పెడితే వాళ్లు ’ఫ్రాడ్ ప్రివెంషన్’ అనే నెపంపై ఇతడికి వీసా ఇవ్వడాన్ని చాలా ఆలస్యం చేసారు. ఈ లోపల అతడేమో ’నాకు అమెరికా వీసా రావాలి’ అని హోమాలు చేయించాడు, తిరుపతి వెళ్లి గుండు గీయించుకున్నాడు, అనేగ గుడుల ప్రదక్షిణలు చేసాడు, జ్యోతిష్కులను సంప్రదించాడు, తాయెత్తులను కట్టుకున్నాడు.. అలా మొక్కుకోని దేవుడు లేడు! కానీ అమెరికా వీసా ఎంత ఎదురుచూసినా ఎన్ని తపస్సులుచేసినా రాలేదు.

దాంతో ’దేవుడనేవాడున్నాడా …. అని మనిషికి కలిగెను సందేహం!’ అని విషాదపు పాటలు పాడుకుంటూ దిగులుగా గాలితిరుగుడు తిరగడం మొదలుపెట్టాడు… చివరకి అతడి అమెరికా పిచ్చి ఎంతదూరం వెళ్లిందంటే అతడు ఏసుక్రీస్తుకు, అల్లాకు గూడా ప్రార్ధనలు సమర్పించాడు… కానీ వీసా ఇంకా రాలేదు… నెలలుగడిచిపోతున్నాయి…. అటుపక్క జర్మనీదేశంలో మాత్రం ఉద్యోగం రెడీగా ఉంది. దాంతో ఉన్న అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకుంటావు అని ఎవరో పెద్దలు సలహాఇస్తే సరే అనుకుని చేసేది లేక అమెరికా వెళ్లే అవకాశం రాక జర్మనీ వీసా అప్లికేషన్ పెట్టాడు. మర్సటిరోజే వీసా వచ్చేసి అతడు జర్మనీ వెళ్లిపోయాడు. తనకి అమెరికా వీసా రానందుకు చాలా దిగులుపడి తను నమ్మిన దేవుడిని నానా తిట్లూ తిట్టుకుని జర్మనీలో ఉద్యోగం మొదలుపెట్టాడు.

ఇంతలో అమెరికాలో ఒక ఘోరం జరిగింది! సెప్టెంబరు 11 వ తారీకున వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో మూడువేలమంది చనిపోయారు. ఇతడికి అమెరికాలో ఉద్యోగం ఇచ్చిన కంపెనీ ఆ వరల్డ్‌ట్రేడ్ సెంటర్ లోనే ఉంది. అంటే ఒకవేళ ఇతనికి అమెరికా వీసా వచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ దుర్ఘటన జరిగినరోజు వరల్డ్‌ట్రేడ్ సెంటర్ లో ఉండి ఉండేవాడు, బహుశా ప్రాణాలు పోగొట్టుకుని ఉండేవాడు. పైగా ఏ కంపెనీ అయితే ఇతడికి ఉద్యోగం ఇచ్చిందో ఆ కంపెనీ ఉద్యోగస్తులు చాలామంది ఆరోజు దుర్ఘటనలో మరణించారు. ఆ తర్వాత ఆ కంపెనీ మూతపడిపోయింది. అంటే ఇతడికి వీసా వచ్చి ఉంటే ఒకవేళ మరణం సంభవించి ఉండేది, లేదా ఒకవేళ అదృష్టవశాత్తూ బ్రతికినా వెళ్లిన నాలుగునెలలకే ఉద్యోగం పోగొట్టుకుని నానా కష్టాలూ పడి ఉండేవాడు. అందుకే అతడి ప్రార్ధనలు ఫలించక అతడికి అమెరికా ఉద్యోగం రాలేదు!

అందుకే దైవఘటన అనే దానిపట్ల మనం నమ్మకం పెట్టుకోవాలి. అడిగినవన్నీ ఇచ్చేవాడైతే ’దైవం’ అనిపించుకోడు! దైవం అంటే మనకి ఏది కనబడదో దాన్ని ఎరిగినవాడు, మన గమ్యం ఏంటో మనకంటే స్పష్టంగా ఎరిగినవాడు భగవంతుడు… “ఉత్పత్తించ వినాశంచ భూతానాం ఆగతాం గతిః వేత్తి విద్యాం అవిద్యాంచ సవాచ్యో భగవానితి” జీవుల ఉత్పత్తి వినాశనాలు, వచ్చి వెళ్లే దారులు, విద్యలు అవిద్యలు అనే ఆరిటిగురించి అత్యంత విశదంగా ఎరిగినవాడే భగవంతుడు… అతడే దైవం!

పూర్వం ఒక రాజుగారి వద్ద చాలా నమ్మకస్తుడైన తెలివితేటలుగలిగిన మంత్రి ఉండేవాడు. అతడు ఏం జరిగినా అది దైవఘటన ‘భగవదేఛ్ఛ‘ అంటూండేవాడు. ఒకరోజు రాజు మంత్రీ ఇద్దరూ కలిసి వేటకు వెళ్లారు. ఇద్దరూ దారితప్పి అడవుల్లో ఎక్కడో లోపలికి వెళ్లిపోయారు. వాళ్లిద్దరే ఇక చుట్టుపక్కల సైనికులు ఇంకెవ్వరూ లేకుండా ఉన్నారు. ఇంతలో ఒక పులి ఎక్కడ్నించి వచ్చిందో హఠాత్తుగా పొదల్లోంచి బైటికి దూకి రాజుగారి చేతిని తీవ్రంగా గాయపరిచింది. రాజుగారు మంత్రిగారు కలిసి తీవ్రంగా పోరాడి మొత్తానికి ఆ పులిని చంపేసారు. కానీ రాజుగారి చేతివేళ్లు రెండు తెగిపోయాయి. ఆయన చాలా బాధలో ఉంటే మంత్రిగారు కట్టుకడుతూ ‘భాధపడకండి రాజా! అంతా ‘భగవదేచ్చ‘ ఇవాళ మీ చేతివేళ్లు తెగి మీరు బాధపడుతుండచ్చు. కానీ మీకు కలిగిన ఈ నష్టంలో భగవంతుడు ఎక్కడో లాభాన్ని పెట్టాడు‘ అన్నాడు. అసలే బాధలో ఉన్న రాజుగారికి ఈ మంత్రి వేదాంతం విని ఒళ్లు భగభగా మండిపోయింది. చాలా కోపం వచ్చి ఆ మంత్రిని అక్కడే ఉన్న పాడుబడ్డబావిలో తోసేసి ఆ మంత్రి పైకి రాకుండా ఎవరినీ పిలిచి సహాయం అడక్కుండా ఒక పెద్ద బండరాయి అడ్డంపెట్టి అక్కడ్నుండి వెళ్లిపోయాడు. పాపం మంత్రి ‘మా రాజుగారికి నామీద కోపం రావడంగూడా భగవదేఛ్ఛ మాత్రమే‘అని మనసులో అనుకున్నాడు. ‘ఎలాగూ నన్ను రక్షించేవారు రారు, ఎలాగూ చనిపోతాను, కాబట్టి ఎప్పట్నించో చేద్దామనుకున్న లక్షకోటి గాయత్రీ జపం చెయ్యడానికి ఇదే మంచి సమయం‘ అనుకుని హాయిగా ఆ పాడుబడ్డబావిలో ధ్యానంలో మునిగిపోయాడు.

అదే అడవిలో కొందరు ఆటవికులు నివసిస్తున్నారు. వాళ్లు తమ కులదేవతకు నరబలి ఇవ్వాలని వెదుకుతుంటే ఒంటరిగా వెళ్తున్న రాజు కనబడ్డాడు. దాంతో వాళ్లు ఆ రాజును బందీగా పట్టుకుని బలి ఇవ్వడానికి సిద్ధం చేసారు. ‘అయ్యో! భగవంతుడి పేరును నిత్యం జపిస్తూ తన కర్మయోగాన్ని తను చేస్తున్న నా మంత్రిని నిర్దాక్షిణ్యంగా బావిలో తోసాను, అందుకే నాకు ఈ ఖర్మపట్టింది‘ అని ఆ రాజు తన మనసులో చాలా దుఃఖిస్తూ బలిపశువుగా రాబోయే కత్తివేటుకోసం సిద్ధంగా కూర్చున్నాడు. ఇంతలో ఆ ఆటవికుల కులగురువు అక్కడికి వచ్చి బలి ఇవ్వబోతున్న వ్యక్తిని నఖశిఖపర్యంతమూ పరీక్షించాడు. రాజు కుడిచేతికి రెండువేళ్లు లేకుండా ఉండడం చూసి ‘శరీరావయవాలు పూర్తిగా లేని నరుడు బలికి పనికిరాడు కాబట్టి వదిలెయ్యండి అని ఆజ్ఞాపించాడు‘. దాంతో ఆ ఆటవికులు ఆ రాజును ఎక్కడ పట్టుకున్నారో అక్కడికి తెచ్చి వదిలేసారు.

దాంతో రాజుకు జ్ఞానోదయం అయింది. “ఆ పులిగానీ నా మీదపడి నా చేతి వేళ్లు తీసేసి ఉండకపోతే ఇవాళ నన్ను ఆ ఆటవికులు ఖచ్చితంగా బలిచ్చి ఉండేవారు. నా ప్రాణాలు ఖచ్చితంగా పోయి ఉండేవి. నిజంగానే మా మంత్రిగారు చెప్పిన మాటలు సత్యం అయాయి. చేతివేళ్లు రెండు తీసుకుని పూర్తిప్రాణాలు నిలబెట్టాడు దేవుడు… ఇది ఖచ్చితంగా భగవదేఛ్ఛ” అని సమాధానపడి పశ్చాత్తాపపడి తిరిగి ఎక్కడడైతే మంత్రిని బావిలోకి తోసాడో అక్కడికి తిరిగి వచ్చి మంత్రిగారిని బావిలోనుండి పైకి తీసాడు. “మంత్రిగారూ మిమ్మల్ని అనవసరంగా అవమానించినందుకు క్షమించండి. మీరన్నట్లు భగవదేఛ్ఛవల్లే నా ప్రాణాలు ఇలా కాపాడబడ్డాయి” అని చెప్పి మంత్రిగారిని ఆలింగనం చేసుకున్నాడు. మంత్రిగారుగూడా చాలా సంతోషించి. “రాజా మీరు నన్ను బావిలో తోయడం గూడా భగవదేఛ్ఛే! నరబలి ఇవ్వడం కోసం వెదుకుతున్న ఆటవికులు శరీరంలో రెండువేళ్లు లేని కారణంగా మిమ్మల్ని వదిలేసారు, కానీ పూర్తి అవయవాలన్నీ భేషుగ్గా ఉన్న నన్ను పట్టుకుని మాత్రం బలిచ్చి ఉండేవారు – చూసారా నాకు మీపట్ల అపకారం జరిగిందని మీరనుకుంటున్నారు. కానీ నాకు మాత్రం ఉపకారమే జరిగింది అని అన్నారు. అలా రాజు మంత్రి తిరిగి రాజ్యానికి చేరుకున్నారు. అలా కధ ‘భగవదేఛ్ఛ‘ వలన సుఖాంతం అయింది.

స్వస్తి! – మాధవ తురుమెళ్ల, లండన్, యుకె

Read More