Blog

06 Aug
0

Bharat Swabhiman Baba Ramdev Lets Join Them on 9th August , Ramlila Maidan

Read More
04 Aug
0

AAC Rally/Procession on SATURDAY 11th AUGUST 2012 AT 12.00NOON, EALING ROAD WEMBLEY, LONDON

ACTION AGAINST CORRUPTION – AAC

The Bharat Swabhiman movement led by Param Pujya Swami Ramdevji has now entered a new phase. On the 9th of August 2012 a massive Andolan will be launched in New Delhi where Pujya Swami Ramdevji will be sitting in protest together with thousands of people at Ram Lila Maidan. Millions of people will be taking part in other major cities in India and across the World. People of Indian origin residing in every part of the World feel the pain of India and they are anxious to help the Movement to save India from Corruption.

To support this andolan – “Action Against Corruption UK” have organised a massive Rally/Procession on Saturday 11th August 2012:

The Rally/Procession will start at 12.00 Noon outside the Brent Indian Association, Ealing Road, Wembley, London, HA0 4TH.

Please begin to gather at 11.00am.

The Rally/Procession will march to the new Sanatan Hindu Mandir, Ealing Road, Wembley, HA0 4TA, where we will have a short break before returning back to the Brent Indian Association Hall along the Ealing Road.

At 2.30am at the Brent Indian Association Hall, we will see a short video presentation of the work that Bharat Swabhiman Trust and Pujya Swami Ramdevji is doing in India to stop corruption and also hear short messages of support from Indian Community Leaders here in the UK. The whole programme will finish at 4.00 pm.

Water, Fruit Drinks and Refreshments will be provided to ALL during the Procession.

For Further Information about the Protest March please contact:

  • O P Yadav:          0208 814 2652
  • Nanjibhai Halai:    07951 862184
  • Ravi Sharma:       0208 554 2143
  • Prabhu Shah:      01895 810646
  • PYPT Office:       0141 420 1192
  • Email: info@pypt.org


PLEASE ARRANGE COACHES FROM ALL OVER THE UK – WE NEED TO PROTEST IN LARGE NUMBERS

We humbly request you ALL to join this noble cause and help us support
the biggest revolution against corruption in India.

ACTION AGAINST CORRUPTION:  http://iamagainstcorruption.blogspot.co.uk

“WE LIVE FOR OUR NATION, WE WILL DIE FOR OUR NATION……..NOW WE NEED TO
UNITE TOGETHER AND RAISE OUR VOICE AGAINST CORRUPTION…….AND MAKE
INDIA BEAUTIFUL AND POVERTY-FREE.

Read More
02 Aug
0

Team Anna members remained defiant as ever – http://www.dailymail.co.uk

Team Anna: Hazare remains hungry and defiant   http://www.dailymail.co.uk

Their failing health notwithstanding, Team Anna members remained defiant as ever as their indefinite hunger strike entered the eighth day, refusing to be hospitalised and warning of ‘retribution’ should the police try to force them out of Jantar Mantar.
The Delhi Police on Wednesday wrote to Team Anna’s Neeraj Kumar, advising that fellow activists Arvind Kejriwal, Manish Sisodia and Gopal Rai – fasting for the past eight days and who doctors say needed immediate medical attention – be admitted to a hospital as soon as possible. 
‘You are advised to follow the doctors’ recommendation and take steps for immediate hospitalisation of Arvind Kejriwal, Gopal Rai and Manish Sisodia to prevent harm to their lives, failing which you would be squarely responsible for any untoward incident,’ additional commissioner of police (New Delhi) K.C. Dwivedi said in the letter. 
Anna Hazare at Jantar Mantar on Wednesday

Read more: http://www.dailymail.co.uk/indiahome/indianews/article-2182290/Team-Anna-Hazare-remains-hungry-defiant.html#ixzz22NjbXcI1

Read More
08 Jul
0

శాంతిగీతిక

Read More
20 Jun
0

ప్రేమ పూలు

Read More
24 Apr
0

అమ్మలగన్నయమ్మ

కం. అమ్మా, నీబిడ్డనునే
      నమ్మా! మాటల సొబగుల నిమ్మా! దయజూ
      డమ్మా! కాదన కమ్మా!
      సన్మా ర్గములో నడుపుమ! శారద! వాణీ!

కం. మెచ్చావట బుధ జనులను
      ఇచ్చావట సకల శుభము నిశ్చల మనమున్
      వచ్చావట వాగ్రూపిగ
      తెచ్చావట కీర్తిసుఖము తెలుగుల వాణీ!

కం. వలదని చెప్పిన వినదిక
     కలవరమున పలవరించు కలతల మనసున్
     నిలవదు నీధ్యానములో
     కొలవదు నిను నిరతరంబు కావుము వాణీ!

కం. చూడాలని నీరూపము,
      వేడాలని నిన్నునేను వెయ్యి విధములన్,
     పాడాలని నీ గుణములు,
     యాడాలని నీ ముంగిట! యాశలు తల్లీ!

కం. నాకూ యున్నది గోరిక
      నీకూనొకమారు పూజ నిజముగ జేయన్!
      రాకూడద మాయింటికి!
      చేకూడద మేలు నాకు జేజీ! వాణీ!

ఉ.  వాణివిగా పితామహుని రాణివిగా విభులేలు బాటలో
     వాణివిగాగ లోకముల పద్యములెన్నియొ వేలువేలు పా
     రాణిగ మారెనీకు! మృదుహాసిని చేకొనవమ్మ దాసుడీ
     ప్రాణములున్న మాధవుని ప్రార్థన వేల్పులవాణి భారతీ |

                                                                   – మాధవ తురుమెళ్ల 24th April 20112

Read More
03 Apr
0

ప్రాముఖ్యత అనే ఎండమావి

నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు, నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే. – శ్రీశ్రీ

ప్రాముఖ్యత అనే ఎండమావి గురించి దాన్ని పొంది పోగొట్టుకున్న వారిగురించి (సెలబ్రిటీలు) ఒకసారి శోభన్ బాబుగారు చాలా బాధపడుతూ ఒకమాట అన్నారు అది నాకు ఎప్పుడూ గుర్తొస్తూంటుంది. ‘కాంతారావు చాలా ప్రముఖ కళాకారుడు ఆయనను నేను చాలా అభిమానించేవాడిని. తను సెలబ్రిటీగా ఉన్న రోజుల్లో ఆయన ఆటోగ్రాప్ కోసం నేనుగూడా క్యూలో నిలుచున్నాను… అటువంటి వ్యక్తి ముసలివాడైపోయిన తర్వాత సినిమాలో ఎక్శ్ట్రా వేషం కోసం నడిఎండలో క్యూలో నిలబడి ఉండటం చూసాను… నా హృదయం ఘోషించింది… ఛీ… అంతటి కళాకారుడికి వయసు మళ్లిపోయిన తర్వాత ఇదా వీళ్లు ఇచ్చేవిలువ అని అసహ్యం వేసింది… అప్పట్నించీ నేను సినిమాలకూ సినిమా వేషాలకూ దూరంగా జరిగిపోయాను. ఇవాళ నీకు బ్రహ్మరధం పట్టిన ప్రజలు నిన్ను మర్చిపోవడానికి ఒక్క క్షణం పట్టదు… “
శోభన్ బాబుగారి మాటలు అక్షర సత్యాలు…. నేను అనేకులు ఇదివరకు చాలా ప్రముఖులైనటువంటివాళ్లను కలుస్తుంటాను… వాళ్లగురించి ఈరోజు పట్టించుకున్నవారు లేరు…

కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిం బొందరే
వా రేరీ సిరి మూటగట్టుకొని పోవంజాలిరే భూమిపైఁ
బే రైనం గలదే శిబిప్రముఖలుం బ్రీతిన్ యశఃకాములై
యీరే కోర్కులు వారలన్ మఱచిరే యి క్కాలమున్ భార్గవా ! – పోతనామాత్యులు

కాబట్టి ప్రఖ్యాతులుగా మారేటప్పుడు మనుషులుగా మనం అర్ధం చేసుకోవాల్సిందేంటంటే ఈ జగత్తులో ఏదీ శాశ్వతంకాదు… మిడిసిపాటు పడగూడదనీ మిన్నువిరిగి మీదపడే సమయం ఎంతోదూరంలో లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి..

Read More
31 Mar
0

శ్రీరామచందృని స్వభావం పట్ల ఊహ అపోహలు

శ్రీరామచందృని స్వభావం పట్ల ఊహ అపోహలు

ప్రతిమానవునికి ఒక మానసిక సమతుల్యం (mindset) అనేది ఉంటుంది.  ఇది ఆ మానవుడు ఎక్కడ పుట్టాడో ఆ ప్రదేశాలవల్ల, ఆ జీవి తలిదండృలు నేర్పిన బుద్ధివల్ల, అలాగే తను పుట్టిపెరిగిన తెగల ఆవారవ్యవహారాలవల్ల (Tribal identity and culture) వస్తుంది…  

ఉదాహరణకు ఒక వందరూపాయలనోటు ఒక రోడ్డుపై పడి ఉన్నదనుకోండి… ఆ నోటుని చూసిన బిచ్చగాడు ’ఈరోజుకు నాకు అన్నం దొరికింది’ అని ఆనందంగా తీసేసుకుంటాడే తప్ప అయ్యో ఇది ఎవరుపోగొట్టుకున్నారో అనుకోడు… ఒక పోలీసు ఆ నోటు రోడ్డుమీద పడి ఉండటం చూసి ’ఈ నోటు ఎవరైనా తమదని చెబితే వాళ్లు నిజం చెబుతున్నారా అబద్ధం చెబుతున్నారా అనేది ఎలా కనుక్కోవడం.  ఒక వేళ అబద్ధం చెబితే వాళ్లని ఏ సెక్షనుక్రింద నేరస్థులుగా విచారించచ్చు’ అని ఆలోచిస్తాడు… అలాగే ఒక లాయరు చూస్తే అతని ఊహలు ఇంకొక విధంగా వెళతాయి.   వందనోటు ఒక్కటే కానీ బిచ్చగాడు ఒకవిధంగా, పోలీసు మరొకవిధంగా, లాయరు ఇంకొకవిధంగా దాన్ని చూసి ఆలోచిస్తారు…  దీన్నిబట్టి చూస్తే, మనకు అర్ధమయేదేంటంటే “కనబడే వస్తువు ఒకటే అయినా అది అనేకమందిలో అనేకరకాలైన భావజాలాలను రేకెత్తించగల అవకాశం ఉంది” అని!   వీరిలో ఎవరి ఆలోచనా తప్పుకాదు… దీన్నే ’స్వభావం’ అని గూడా అంటారు (భావం అంటే ఆలోచన, స్వ భావం అంటే సొంత ఆలోచన)…  అయితే వచ్చే చిక్కల్లా నా ఆలోచనే నిజం అవతలివానిది కాదు అనుకోవడంలో ఉంది…

హైందవుల నమ్మకం ప్రకారం జీవితం అనేది ఒక అనివార్యమైన ఒక మహా చక్రం… ‘జాతస్య హి ధృవో మృత్యుః ధృవం జన్మ మృతస్యచ‘  జీవి జననమరణాలమధ్య వృత్తాకారంలో తిరుగుతాడు అని గాఢంగా నమ్మేవారి స్వభావం ఒకవిధంగా ఉంటుంది… ఆ స్వభావాన్ని అర్ధంచేసుకోకపోవడం వల్ల హైందవులపట్ల అపార్థం ఎక్కువ కలుగుతుంటుంది…  ఈ జన్మ ఒక్కటే సత్యం ఇంకొక జన్మ రాదు అనుకున్నప్పుడు కలిగే స్వభావం వేరు… ఎవరి స్వభావం వారిది…

శ్రీరాముడు సీతమ్మని కష్టపెట్టాడు అనుకోవడం ఒక స్వభావం…. లేదు ఆయన కష్టపెట్టలేదు అనుకోవడం ఇంకొక స్వభావం…   సీతమ్మని అగ్నిలో దూకమన్నాడు అని ఆరోపణ చేస్తాము… కానీ ఈరోజు మనకు తెలిసిన సత్యం ఏంటంటే అగ్నిగుండంలోనుండి దూకడం నడవటం అంత పెద్దకష్టమైన పని కాదని!  మానవులు కొన్నికొన్నిసార్లు తాము బాధల్లో ఉన్నప్పుడు ఉక్రోషంలో అనాలోచితంగా ఏవేవో పరుషమైన మాటలు అనేస్తారు ’సీతమ్మ లక్ష్మణుడి పట్ల అలాగే పరుషంగా మాట్లాడింది, కైక తన భర్త దశరధునిపట్ల పరుషంగా మాట్లాడింది, అలాగే మంధర కైక పట్ల, రావణుడు విభీషణునిపట్ల, రావణుడు మారీచునిపట్ల, శూర్పణక రావణునిపట్ల — ఇలా రామాయణంలో మంచివారు దుర్మార్గులు అందరూ తమ పాత్రలకు విరుద్ధంగా మాట్లాడతారు….. దీన్ని బట్టి చూస్తే ’రాముడు సీత పట్ల పరుషంగా మాట్లాడటం’ అనే విషయం మనకు తెలిసిపోతుంది… శ్రీరాముడు మానవులలోని దేవుడు…. ఆయన మర్యాదాపురుషోత్తముడు… తన స్వభావాన్ననుసరించి ఆయన ప్రవర్తించాడు, అదేవిధంతా తన స్వభావాన్ననుసరించి సీతమ్మా ప్రవర్తించింది….. లక్ష్మీనారాయణుల అవతారాలైన వారు లక్ష్మీనారాయణుల స్వభావులుగానే ప్రవర్తించారు…

అందువల్ల నాకు శ్రీమద్రామాయణంలో ఎందుకో తప్పు కనబడదు… అది నా స్వభావం అనుకోండి… మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు… శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే… —- మాధవ తురుమెళ్ల ౩౧ మార్చి ౨౦౧౨

Read More
26 Mar
0

భోజ్యానాయక్ మరణం

భోజ్యానాయక్ మరణ చిత్రాన్ని నిన్న నాకెవరో పంపించారు… చూసి నా మనసు చలించిపోయింది… ఎందుకీ యుద్ధాలు బలవన్మరణాలు వాళ్లడిగిన రాజ్యం వాళ్లకు ఇచ్చెయ్యగూడదా అని నా మనసు నాలుగు పద్యాలు పలికింది వాటిని ఇక్కడ ఇస్తున్నాను…

భోజ్యానాయక్ మరణం
============
పద్యరచన: తురుమెళ్ల మాధవ ’26 మార్చి 2012′

మ.
మరపో మారిన రాజ్యమో ఎవరి లాభంబీ తెలంగాణమో
కరవై పోయెన రాజమా ర్గముల యోకారు ణ్యమేలేదహో
మరణా న్నావహ మేలజే యవలె? యామంటల్బడెన్గాలె! యే
షరతుల్బెట్టక యేల నేగవలె భోజ్యానాయకుండ క్కటా!

చేతికందిరావాల్సిన ఆ బిడ్డని పోగొట్టుకున్న ఆ తల్లి మనసుగూర్చి ఆలోచిస్తే….

కం.
కాడా బిడ్డడు యమ్మకు?
లేడాయని బాధపడద రేతిరి పగలున్?
చూడాలనుకొని బిడ్డను
వేడాలనుకొను తనకిక వేదనె మిగిలెన్!

కం.
బాధిత వర్గపు కోరిక
శోధిత మున్జేయ దలువర సోదరు లెవరూ?
వేధిత పామర జనములు
వీధిన పడియున్నతీరు విశదము గాదా!

ఉ.
చిందరవందరై నటుల చించిన విస్తరి తీరుతెన్నుగా
ఎందుల కీయుద్ధ మసలు? ఎవ్వని రాజ్యము లేవిబోవునో!
వందల వేలసంఖ్యలుగ వీధినబోవుచు వాదులా డగా
తొందరలేదు లేదనుచు తోచిన రీతిన జాగులేలనో!

కం.
సోదరులేగద చూడగ
వాదనపడు వారు తెలుగు వారలు గారా!
రోదన కూడదు వారిని
వేదన బాల్జే యవద్దు వేరు పడెదమో… 

కం.
చాలిక ఈ మరణంబులు
పోలికలేనిది జగడము పోనీరాదా!
వాళ్లిక అడిగిన రాజ్యము
వాళ్లకు ఇచ్చెయ్యమనుచు వినతుల జేతున్!

——xxx—–

Read More
20 Mar
0

ఒక మధుర క్షణం

నిశిరాతిరి కాటుక కళ్ళు నవ్వితే ఒలికినట్లున్న నక్షత్రాలు
కొంచెం బిడియంగా చుట్టుకున్నట్లున్న పల్చటి వెన్నెల చీరలో
దాచాలని ఎంత ప్రయత్నంచేసినా దాగని అందాలు…
సృష్టి రహస్యాలను
చెవుల్లో గుసగుసలుగా చెప్పే
పిల్ల తెమ్మెరల మంద్రద్వ్హనులలో,
నునుసిగ్గుగా –
నా గుండెచప్పుడు నేపధ్యంగా
నాలో నిశ్శబ్దంగా ఆలాపించబడుతున్న ప్రేమ గీతం…

వికసించిందో, పుష్పించిందో, అహ్లాదభరితంగా చలించిందో,
మల్లెలుగా జాజులుగా అగరొత్తుల పొగలు పొగలుగా
సువాసనలుగా ఆఘ్రాణితమైన ఆ మధుర క్షణం
నేను నేను మరిచిపోలేని క్షణం….

నా హృదయపు ప్రేమ సింహాసనం మీద
నమ్మకంగా ఒదిగిన నా నెలవంక
అలవోడ్పుగా నను చూస్తూ హత్తుకున్న సిగ్గుల మొగ్గయింది…
నాకొక అస్తిత్వాన్నందిస్తూ తను నాలో కరిగిపోయింది,
నేనేతనుగా తనే నేనుగా త్వమేవాహంగా
ఆహ్లాదంగా ఆప్యాయంగా ఆనందంగా మారిపోయింది…

– మాధవ తురుమెళ్ల
కౌముది మాసపత్రిక మార్చి ౨౧౦౧౨ సంచికలో ప్రచురితమైన కవిత
http://www.koumudi.net/Monthly/2012/march/index.html 

Read More