మూడురంగుల పతాకం మధ్యలో ఒక ధర్మ చక్రం
ఆ ధర్మచక్రంలానే నాలోకూడా
అంతుతెలియని మనో పరిభ్రమణం,
గాందీగారిని స్వర్గంలో కలిస్తే అడగాలనుకునే ఒక ధర్మసందేహం.
గాంధీతాతా! నాకు తెలియక ఆదుగుతున్నాను
ఏమీ అనుకోకు, తప్పయితే క్షమించు.
ఆ మువ్వన్నెల రంగుల జెండా –
వచ్చేసిందొచ్చేసింది నాకు స్వతంత్ర్యం అంటూ
ఆ స్తంభాన్నెక్కేసి ఆనందంగా రెపరెపలాడుతోందా,
లేక –
ఇక్కడగూడా నేను బందీనే అంటూ
రాజకీయపు రాకాసుల కోరల్లోచిక్కి విలవిలలాడుతోందా… 

               – మాధవ తురుమెళ్ల