ఎవరు పేద ఎవరు రాజు ఎవరికెవరు భారతమా,
ఎవరి నెవరు దోస్తారో ఎవరికెరుక భారతమా,
ఏనాటికి ముక్తి నీకు నిరుపేదల భారతమా,
ముందుకెపుడు సాగుతావు మునులగడ్డ భారతమా!

విచ్చలవిడి అన్యాయం వెదజల్లెను లంచాలను
భారతదేశపు సంపద కొల్లగొట్టు రాబందులు…
గనులనొకడు కాంట్రాక్టులనింకొక్కడు
ఎక్కడబడితే అక్కడ అక్రమాలకు పాల్పడె
రాజకీయ రాబందుల లంచగొండి సామ్రాజ్యం
పేపర్లలో టీవీలలో రేడియోలొ ఎటుచూసిన
పీక్కుతిన్న శవాలపై ప్రతిదినమూ దుర్గంధం..

అన్యాయం ఇది ఏంటని అడిగెను అన్నాహాజారె
రాబందుల నెదుర్కొనగ పూనుకొన్న రామదేవ్
ఇకసాగదు అన్యాయం ఇకచాలీ అరాచకం
ప్రాణాలని పణంచేసి పోరాడె వీరులు
ఉద్యామాల బాటలలో అక్రమాల నెదిరించి
ముక్తినీకు తెస్తారు నిరుపేదల భారతమా
ముదమును కలిగిస్తారు మునులగడ్డ భారతమా….

– మాధవ తురుమెళ్ల