Archive for కవితలు

Monday, March 26th, 2012 @ 5:47PM

భోజ్యానాయక్ మరణం

భోజ్యానాయక్ మరణ చిత్రాన్ని నిన్న నాకెవరో పంపించారు… చూసి నా మనసు చలించిపోయింది… ఎందుకీ యుద్ధాలు బలవన్మరణాలు వాళ్లడిగిన రాజ్యం వాళ్లకు ఇచ్చెయ్యగూడదా అని నా మనసు నాలుగు పద్యాలు పలికింది వాటిని ఇక్కడ ఇస్తున్నాను… భోజ్యానాయక్ మరణం============పద్యరచన: తురుమెళ్ల మాధవ ’26 మార్చి 2012′… మ.మరపో మారిన రాజ్యమో ఎవరి లాభంబీ తెలంగాణమోకరవై పోయెన రాజమా ర్గముల యోకారు ణ్యమేలేదహోమరణా న్నావహ మేలజే యవలె? యామంటల్బడెన్గాలె! యేషరతుల్బెట్టక యేల…

Posted by
Posted under: కవితలు
View
Tuesday, March 20th, 2012 @ 3:19AM

ఒక మధుర క్షణం

నిశిరాతిరి కాటుక కళ్ళు నవ్వితే ఒలికినట్లున్న నక్షత్రాలుకొంచెం బిడియంగా చుట్టుకున్నట్లున్న పల్చటి వెన్నెల చీరలోదాచాలని ఎంత ప్రయత్నంచేసినా దాగని అందాలు…సృష్టి రహస్యాలను చెవుల్లో గుసగుసలుగా చెప్పే పిల్ల తెమ్మెరల మంద్రద్వ్హనులలో,నునుసిగ్గుగా –నా గుండెచప్పుడు నేపధ్యంగా నాలో నిశ్శబ్దంగా ఆలాపించబడుతున్న ప్రేమ గీతం… వికసించిందో, పుష్పించిందో, అహ్లాదభరితంగా చలించిందో,మల్లెలుగా జాజులుగా అగరొత్తుల పొగలు పొగలుగా సువాసనలుగా ఆఘ్రాణితమైన ఆ మధుర క్షణంనేను నేను మరిచిపోలేని క్షణం…. నా హృదయపు ప్రేమ సింహాసనం…

Posted by
Posted under: కవితలు
View
Thursday, March 1st, 2012 @ 8:29AM

మద్యంలేకుండా మత్తెక్కించేది ప్రేమ

మాటకు అందనిది, మౌనంలో ఒదిగిపోయినదిచిరునవ్వుల క్రీగంటచూపుల గాలులకుతలలూపుతూ —స్పందించినహృదయపుష్పపు పుప్పొడిలాసృష్టిక్రమంలో భాగంగా –అవ్యక్తంగా ఆప్యాయంగా –మనసును హత్తుకునేదిమద్యంలేకుండా మత్తెక్కించేది ప్రేమ.  – మాధవ తురుమెళ్ల

Posted by
Posted under: కవితలు
View
Saturday, February 18th, 2012 @ 9:13PM

పిచ్చిరాతలు

‘పిచ్చిరాతలు‘ రాత్రి చీకటి కళ్లు కప్పుకున్న ఉషస్సు సూర్యుడినింకా జనించనేలేదు..తుఫానుల అల్లకల్లోలాలలో లోకాలన్నిటినీ హాహాకారాలకు గురి చేయగల బడబానలాన్ని సముద్రం ఇంకా ప్రసవించనేలేదుకానీ నీ వెందుకు ప్రపంచగర్భాన్ని మోస్తూ మూలుగుతూ శాంతికి జన్మనిద్దామని ప్రయత్నంచేస్తున్నావు? – – మాధవ తురుమెళ్ల

Posted by
Posted under: కవితలు
View
Thursday, December 15th, 2011 @ 3:45AM

కలలు పోగొట్టే మంత్రం

జీవితంలో తనకు జరిగిన అన్యాయాన్ని గూర్చిగానీ –తనని నమ్మించి మోసగించిన తను అతిగా నమ్మిన తనవారిని గూర్చిగానీ –తనకు జరిగిన అవమానాలను గూర్చిగానీ,ఎవరికీ ఫిర్యాదు చెయ్యకుండా –చనిపోయిన ప్రియబంధువు శవం చుట్టూకుండనీరు తీసుకుని తలదించుకు  ప్రదక్షిణలు చేసిన వాడికి మల్లే.,తనను కికురించిన ప్రేమకు –ఏనాడో మానసిక దహనసంస్కారం చేసి,జ్ఞాపకాల నీటికుండలనుండి కావాలని పెట్టినకళ్ల చిల్లులద్వారా కన్నీళ్లన్నీ కార్చేసి,పెదవులు రెంటినీ సంస్కారం అనే దబ్బనపు పురికొసతో కుట్టిమౌనంగా తలదించుకుని –తన దురదృష్టం అంతే…

Posted by
Posted under: కవితలు
View
Friday, October 7th, 2011 @ 2:52PM

ఈ రోజు సమ్మెవేళ

పైన నడినెత్తిన ప్రపంచాన్ని దగ్ధం చేసేటట్లుఆగ్రహోదగ్రంగా సూర్యగోళం భగబగా మండుతోంది. రోడ్ఛుపక్క ఏ చీడపురుగు చేతపడిందో కాలంకాని కాలంలోఆకులు పూర్తిగా రాల్చేసుకున్న చెట్టు సిగ్గుతో నగ్నంగా నిల్చోనుంది… నీరు దొరక్క గొంతు ఆర్చుకుపోయిన కాకిదిక్కుతెలియక పోయినట్లు అటూ ఇటూ అదేపనిగా తలతిప్పుతూఏవో విపరీతపు అరుపులు అరుస్తోంది…. తోక కాళ్ల మధ్యకు ముడుచుకుని జీవితంలో ఓడిపోయిఅన్నీ పోగట్టుకున్న దానికి మల్లే ఒక పిచ్చికుక్కబ్రతకటానికి ఆరాటపడుతూ తోటికుక్కల దంష్ట్రాకరాళాలనుండి రక్కసి రక్కులనుండి దూరంగా…

Posted by
Posted under: కవితలు
View