Category Archives: కవితలు

ప్రేమ పూలు

Read More

అమ్మలగన్నయమ్మ

కం. అమ్మా, నీబిడ్డనునే      నమ్మా! మాటల సొబగుల నిమ్మా! దయజూ      డమ్మా! కాదన కమ్మా!      సన్మా ర్గములో నడుపుమ! శారద! వాణీ! కం. మెచ్చావట బుధ జనులను      ఇచ్చావట సకల శుభము నిశ్చల మనమున్      వచ్చావట వాగ్రూపిగ      తెచ్చావట కీర్తిసుఖము తెలుగుల ...

Read More

భోజ్యానాయక్ మరణం

భోజ్యానాయక్ మరణ చిత్రాన్ని నిన్న నాకెవరో పంపించారు… చూసి నా మనసు చలించిపోయింది… ఎందుకీ యుద్ధాలు బలవన్మరణాలు వాళ్లడిగిన రాజ్యం వాళ్లకు ఇచ్చెయ్యగూడదా అని నా మనసు నాలుగు పద్యాలు పలికింది వాటిని ఇక్కడ ఇస్తున్నాను… భోజ్యానాయక్ మరణం============పద్యరచన: తురుమెళ్ల మాధవ ...

Read More

ఒక మధుర క్షణం

నిశిరాతిరి కాటుక కళ్ళు నవ్వితే ఒలికినట్లున్న నక్షత్రాలుకొంచెం బిడియంగా చుట్టుకున్నట్లున్న పల్చటి వెన్నెల చీరలోదాచాలని ఎంత ప్రయత్నంచేసినా దాగని అందాలు…సృష్టి రహస్యాలను చెవుల్లో గుసగుసలుగా చెప్పే పిల్ల తెమ్మెరల మంద్రద్వ్హనులలో,నునుసిగ్గుగా –నా గుండెచప్పుడు నేపధ్యంగా నాలో నిశ్శబ్దంగా ఆలాపించబడుతున్న ప్రేమ గీతం… ...

Read More

మద్యంలేకుండా మత్తెక్కించేది ప్రేమ

మాటకు అందనిది, మౌనంలో ఒదిగిపోయినదిచిరునవ్వుల క్రీగంటచూపుల గాలులకుతలలూపుతూ —స్పందించినహృదయపుష్పపు పుప్పొడిలాసృష్టిక్రమంలో భాగంగా –అవ్యక్తంగా ఆప్యాయంగా –మనసును హత్తుకునేదిమద్యంలేకుండా మత్తెక్కించేది ప్రేమ.  – మాధవ తురుమెళ్ల

Read More

పిచ్చిరాతలు

‘పిచ్చిరాతలు‘ రాత్రి చీకటి కళ్లు కప్పుకున్న ఉషస్సు సూర్యుడినింకా జనించనేలేదు..తుఫానుల అల్లకల్లోలాలలో లోకాలన్నిటినీ హాహాకారాలకు గురి చేయగల బడబానలాన్ని సముద్రం ఇంకా ప్రసవించనేలేదుకానీ నీ వెందుకు ప్రపంచగర్భాన్ని మోస్తూ మూలుగుతూ శాంతికి జన్మనిద్దామని ప్రయత్నంచేస్తున్నావు? – – మాధవ తురుమెళ్ల

Read More

కలలు పోగొట్టే మంత్రం

జీవితంలో తనకు జరిగిన అన్యాయాన్ని గూర్చిగానీ –తనని నమ్మించి మోసగించిన తను అతిగా నమ్మిన తనవారిని గూర్చిగానీ –తనకు జరిగిన అవమానాలను గూర్చిగానీ,ఎవరికీ ఫిర్యాదు చెయ్యకుండా –చనిపోయిన ప్రియబంధువు శవం చుట్టూకుండనీరు తీసుకుని తలదించుకు  ప్రదక్షిణలు చేసిన వాడికి మల్లే.,తనను కికురించిన ప్రేమకు ...

Read More

ఈ రోజు సమ్మెవేళ

పైన నడినెత్తిన ప్రపంచాన్ని దగ్ధం చేసేటట్లుఆగ్రహోదగ్రంగా సూర్యగోళం భగబగా మండుతోంది. రోడ్ఛుపక్క ఏ చీడపురుగు చేతపడిందో కాలంకాని కాలంలోఆకులు పూర్తిగా రాల్చేసుకున్న చెట్టు సిగ్గుతో నగ్నంగా నిల్చోనుంది… నీరు దొరక్క గొంతు ఆర్చుకుపోయిన కాకిదిక్కుతెలియక పోయినట్లు అటూ ఇటూ అదేపనిగా తలతిప్పుతూఏవో ...

Read More

ఆత్మ క్షోభ

ఆత్మ క్షోభ——– [చూసావా!]ఈ సంధ్యని గూడా మనం జారవిడుచుకున్నాము….ఈ  సాయంత్రపు సమయంలోనీలపు రాత్రి  – ఆత్రంగా ప్రపంచంపై పడిపోబోతున్నవేళ చేయి చేయి కలుపుకు నిలుచోవాల్సిన మనం ఎవరికీ కనిపించనేలేదు… దూరదూరపు కొండలపై అంచులపై ముగిసిపోతున్నఈ సూర్యాస్తమయపు సంబరాన్నినేను ఒక్కడినే నా కిటికీలోంచి పరికిస్తున్నాను. కొన్నిసార్లు ...

Read More

No Title

కొండలతో బండల ఉనికిని అడగకుసముద్రాన్ని అలలంటే ఏంటని అడగకునిరంతర జీవన ప్రయాణంలో అహరహమూ శ్రమిస్తున్ననా హృదయంలో విషాదం ఎక్కడుందని అడగకు… — మాధవ తురుమెళ్ల

Read More
123