Archive for కవితలు
కవిత: నిజంగా నన్నింకా భ్రతకమంటావా?
నన్నింకా బ్రతకమంటావా నిజంగా నన్నింకా భ్రతకమంటావా? చిక్కని ఈ జనారణ్యంలో – మమతల నాటకాన్ని అర్ధంచేసుకోలేక మనుషుల కఠినత్వాన్ని, మూర్ఖత్వాన్ని జీర్ణించుకోలేక అలాగని నా దారిన నేను పోలేక – మతితప్పి మనసుపోగొట్టుకుని భ్రమిస్తున్నవాడిని… ప్రభూ – నాకు ఒక అస్తిత్వంలేదు…. అబద్ధపు చట్రంలో అస్తవ్యస్త వ్యవస్థలో ఎందుకో బలవంతంగా నన్ను నేను ఇరికించుకున్నవాడిని. గాయపడిన గొంతుగలవాడిని, దీనుడిని ఇంకా ఏ శృతిని ఆలపించమని ఈ దీనుడిని ఆజ్ఞాపిస్తున్నావు…
కవిత: పొలిటికల్ కరపత్రిక
పొలిటికల్ కరపత్రిక—ఎక్కడోమస్తిష్కంలో మూలలో దాగినఒక మాటకి అందని మౌనానికి-తిరస్కృత పరిష్వంగానికితిమిరనిరంకుశ నిశీధికితితీక్షకు, తీతువుపిట్టకు,హాలాహలానికి హాహాకారానికిఅవినాభావ సంబంధం ఉన్నదని –ఒక మునికి జ్ఞానోదయమైంది.వెలిగించండి మెదడుల్లో కాగడాలనుతొలగించండి జ్ఞానేంద్రియ కవాక్షాల కెరటాలనుచల్లండి బతుకువీధుల్లో పాపప్రక్షాళితంగావించే పావనగంగను….రేపొక మహోదయం కాబోతోందిఅకించనితయై అనారోగ్య రక్కసి కాటేస్తున్న కన్నపేగునుపసిపాపను పొత్తిళ్లలో ఎత్తుకున్న తల్లిముసిముసి నవ్వులు నవ్వబోతోంది….పూటతిండికి నోచుకోని దౌర్భాగ్యపు ముసలి ఒకతెరేపు భారతదేశం నాది అని గర్వపుగీతిక పాడబోతోంది.రోపొక మహోదయం కాబోతోంది.[రేపు రిపబ్లిక్ డే కదా…..!!!!! ]-మాధవ తురుమెళ్ల 25/1/2013
కవిత – పడకకి రాని నిద్ర
పడకకి రాని నిద్ర=========== పడకకి రాని నిద్రఅలిగిన ప్రియురాలికంటేఎక్కువగా బాధిస్తుంది..!విసుగుని కళ్లలోచిరాకును నొసట్లో నింపేసి – అహ్లాదమనే బిడ్డని కనేఅవకాశం లేకుండా చేస్తుంది… నిద్రరాని ప్రతిరాత్రిబలవంతంగా విడాకులకు గురైనభర్తలాగా అంతరంగంలో బాధ..! నిద్ర పడకకి రాని పతిరాత్రీవెలయాలిని ఆశ్రయించిన విటుడిలాగాపుస్తకమో –సంగీతమో –టీవినో,మరింత ముదిరిన వేశ్యా వ్యసనంలో –నిద్రమాత్రలో బ్రాందీసీసానోఏదో ఒకదాన్ని ఆశ్రయించిబలవంతంగా నిద్రతో రమించి,మర్సటిరోజు మామూలుగానేరాత్రి ఏమీ జరగనట్లు మొహం..| మనిషికి రాని నిద్రమరణంతో సమానం,కానీ విచిత్రం –మరణం మాత్రంఅదేంటో…
కవిత: పడవ ప్రయాణం
పడవ ప్రయాణంఓ నావికుడా ఈ ప్రపంచం ఒక మహాసముద్రం నేను ఒంటరి ప్రయాణీకుడిని.నీవొక్కడివే నాకు తోడు నీడ… నేను నమ్మిన నావికుడా!నా ప్రియబంధువా!నన్నీ సముద్రాన్ని- దాటించి శాంతి తీరానికి చేర్చు.నేను నీ ఆశ్రితుడిని,నిన్నే శరణన్నవాడిని! నేను నమ్మిన నా దైవమా! నా నావ నీటిలో ఉండేట్లు చూడుకానీనీటిని మాత్రంనా నావలో ఉండేట్లు చూడకు… ప్రపంచాన్ని నా పడవలో చేర్చినా ఆత్మను నడి సముద్రంలో ముంచకు… -మాధవ తురుమెళ్ల
దృశ్యం – కవిత
దృశ్యం ఒక్కోసారి ప్రకృతిలో దృశ్యాన్ని చూసిఅంతరంగంఅద్భుత అచేతనత్వాన్ని పొందుతుంది.మేనంతా పులకించిమనసును లయంచేసిమనిషిని మహర్షిలా మారుస్తుంది…. కవిర్మనీషీ పరిభూస్వయంభూః…. దృశ్యలీనిత నిశ్శబ్దానికిఇంక వేరే అర్ధాలేవీ ఉండవు.అద్వైతభావనలో మునిగిన పెదవులు అరవిందాల్లా విచ్చుకున్నా –మాటల సీతాకోకల్ని తమపై వాలనివ్వవుదృశ్యాన్ని కొలవనివ్వవు, తెలిమబ్బు కిరణం,పురివిప్పిన నెమలి,సముద్రంలోంచి ఉదయిస్తున్న సూర్యుడు,తనని తానర్పించుకుని ప్రియుడి గుండెలపై నమ్మకంగ –ఒదిగి గువ్వపిట్టలా నిద్రిస్తున్న అలిసిన ప్రియురాలి మోము,నిద్రించే పసిపాపన ముసిముసి నవ్వులు,వసంతంలో చిగురించిన అడవిఅన్నీ దృశ్యాలే! దృశ్యాన్ని చూసిన…
నా కోరిక – కవిత
చీమలు పెట్టిన పుట్టలోపాములు చేరుతున్నాయి.సాకలేని కోకిలకాకిగూటిలో తనబిడ్డని వదుల్తోంది.కురవని మేఘంతన నల్లదనంతో నేలను –నమ్మిన రైతును మభ్యపెడుతోంది.ముద్దొచ్చే గులాబీ ముళ్లకంపలో దాక్కుంది.పతితపావనమైన గంగలో బండరాళ్లే మునిగున్నాయి. కొందరు అనూచానంగా –వంచన, కర్కశత్వం, నిర్దయత్వంఇవేనా ప్రకృతిధర్మాలు అని ప్రశ్నిస్తున్నారు. ఎందుకో తెలియని మాయ!ఆత్మలో లయమై త్వమేవాహం అనాల్సిన మనిషితనలోపల లోలోపలఎక్కడోదాగినఅరిషడ్వర్గాల ఆరాటాల్లో మునిగితన ప్రకృతిని తానే బలాత్కరిన్నాడు… కొందరుశూన్యత ముసుగు కప్పుకునివిషాదపు చెలమలవద్దఆశ్రువులతో స్నానం చేస్తున్నారు… మరికొందరుపోరాటపు జెండాకింద నిలబడితమ రుధిరంతో…