Blog

Sunday, January 23rd, 2011 @ 10:20AM

సముద్రం – కధ

సముద్రం http://www.eemaata.com/em/issues/199911/868.html Published in eemata magazine 1999 సముద్రం హోరుమంటూ శబ్దంచేస్తోంది. సంధ్యాకాలం అవడంతో పక్షులన్నీ హడావుడిగా గూటికి చేరుకోవడానికన్నట్లు బారులు తీరి ఆకాశంలో వెళ్లిపోతున్నాయి. రాత్రి అవడానికి సమయం దగ్గరపడటంతో నక్షత్రాలు మినుకుమినుకు మంటూ మింటిలో కనబడటం మొదలుపెట్టాయి. సాయంత్రం సముద్రంవడ్డుకు షికారుగా వచ్చినవాళ్లందరూ అక్కడక్కడా గుంపులు గుంపులుగానో, ఒంటరిగానో కూర్చోని వున్నారు. కొంతమంది సముద్రాన్ని పరికిస్తున్నారు. కొంతమంది వచ్చేపోయేవాళ్లని పరీక్షగా చూస్తున్నారు. సముద్రం ఒడ్డున మనుషులందరికీ దూరంగా ఇసుక…

Posted by
Posted under: కధలు
View
Tuesday, January 18th, 2011 @ 6:04PM

చెట్టుతల్లి – కవిత

చెట్టుతల్లి అమ్మా!ఆవేదన నిండిన కళ్లతో,అసహాయంగా రాలిపడే కన్నీళ్లతో,మూగగా రోదించగల శక్తిమాత్రమేగల వాడిని…. పచ్చగానూరేళ్లూ బ్రతకమంటూ మాత్రంప్రార్థించగలవాడిని.. మరణానికి  విలువిచ్చేవారికిబ్రతుకు సుఖాన్ని తెలియజెప్పలేని వాడిని,ఖచ్చితంగా అశక్తుడిని కానీ ఆవేశగ్రస్తుడిని… చిన్నమైన మానులతోఛేత్త ఎవరో తెలియని అమాయకత్వంతో –మోడై నేల రాలిన నిన్నుకనుమరుగైన నీ పచ్చదన్నాన్ని చూసిఈ వేళ నా హృదయంప్రచండ శరాఘాతానికి గురైనలేడిలాగా మూలుగుతోంది… పచ్చటి ఆకులతోసంతోషంగా గలగలలాడుతూప్రచండ సూర్యాగ్నినుండి సేదదీరేందుకు ఛాయలనూఅందాన్నీ ఆనందాన్నీ,ఆహ్లాదభరిత సంధ్యలనూ,పక్షుల కిలకిలారావాల సంగీతాన్నీ-ఎంతెంత ఆప్యాయతని పంచి…

Posted by
Posted under: కవితలు
View
Tuesday, January 18th, 2011 @ 11:38AM

రైలుబండి కోసం – కవిత

రైలుబండి కోసం వెన్నెల్లాంటి అందమైన పసితనపు జ్ఞాపకం… తాతకు ఆడుకుంటానికని అబద్ధం చెప్పిరైలుస్టేషను అరుగుల మీద కూర్చునివచ్చి వెళ్లే రైలుబండ్లను చూసే పసితనపు జ్ఞాపకం….కదిలిపోయే రైలుబండిని చూసినాఎర్రజెండా చూపించి సర్కస్ లో పులిని ఆపేవాడిమల్లేఅంతపెద్ద దయ్యంలాంటి రైలుబండినీఅమాంతంగా ఆపుచేసే స్టేషనుమాష్టరుని చూసిఆరాధనతో మనసు పొంగి పరవళ్లు తొక్కేది…స్టేషన్ మాష్టరుగారు ముద్దుగా తలనిమిరి చాక్లెట్టిస్తేవిచ్చుకున్న పత్తికాయల్లాంటి కళ్లతోప్రపంచాన్నే జయించిన సంబరం మనసంతా ఊపేసేది…కీచుకీచుమంటూ చప్పుళ్లుచేస్తూ –అచ్చూ ముసలితనం మీదబడ్డ మా తాతకి మల్లేఉసూరుమంటూ…

Posted by
Posted under: కవితలు
View