కవిత: పడవ ప్రయాణం

Monday, August 19th, 2013 @ 2:22PM

పడవ ప్రయాణం

ఓ నావికుడా ఈ 
ప్రపంచం ఒక మహాసముద్రం 
నేను ఒంటరి ప్రయాణీకుడిని.

నీవొక్కడివే నాకు తోడు నీడ… 
నేను నమ్మిన నావికుడా!
నా ప్రియబంధువా!
నన్నీ సముద్రాన్ని- 
దాటించి శాంతి తీరానికి చేర్చు.
నేను నీ ఆశ్రితుడిని,
నిన్నే శరణన్నవాడిని!

నేను నమ్మిన నా దైవమా!

నా నావ నీటిలో ఉండేట్లు చూడు
కానీ
నీటిని మాత్రం
నా నావలో ఉండేట్లు చూడకు…

ప్రపంచాన్ని నా పడవలో చేర్చి
నా ఆత్మను నడి సముద్రంలో ముంచకు…

-మాధవ తురుమెళ్ల

Posted by
Categories: ఆధ్యాత్మికం, కవితలు

No comments yet. Be the first!
Leave a Reply