తెలుగుభాషలోని వ్యాసం కోసం ఈ ఇంగ్లీషువ్యాసం క్ర్రింద చూడండి.
As I think: (A mother killed her 3 year old little boy in UK)….– In nature Papa Bear goes out to hunt and bring back food while mummy Bear 
 fiercely protects her cubs guarding the entrance of the cave. We know the living rules of most of the animals – we know how all animals eat, roam, sleep and communicate. But we don’t really know about the natural habits of Human-animal! A Human-animal can swim like a fish, hunt like a Tiger, be cunning like a crow etc etc… But all these are adaptive habits…The sad truth is that Human-animal forgot how he used to live… That is why the world is in so much conflict. It is in so much pain… Human mummy-bear is supposed to be gentle, loving and caring towards her human-cubs… Yet she had beaten her cub to death in rage.. And she lied like a fox, tried to deceive other humans like a Hyena…..It is not just her, unfortunately there are countless human-animals who forgot their natural mode of living they express adaptive modes which create tension. They have no peace in themselves… How can the world be peaceful when it is getting inhabited more and more such Human-animals with adaptive behaviours, zombies and vampires! .It is irresponsibility of vampires to allow that Mom to breed five different cubs from five different mating partners.. It is irresponsibility to let her live on welfare… And sadly no sensible Human is allowed to teach moral and ethical values. Because Zombies and Vampires don’t like any such.. It pains me to see that Human-animal the only species who is hopelessly lost in this universe… –Madhava Turumella

[నా ఆలోచన: ] (ఇంగ్లండులో ఒక తల్లి తన మూడేళ్ల పసిబిడ్డని నిర్దాక్షిణ్యంగా కొట్టి కొట్టి చంపేసింది)… మీరు ప్రకృతిని గమనించండి… తండ్రి ఎలుగుబంటి వేటాడి తిండిసంపాదించి తెచ్చేందుకోసం బయటకు అడవిలోకి వెళ్తుంది. తల్లి ఎలుగుబంటి తన పిల్లలను చాలా తీవ్రమైన ప్రేమానుభూతులతో కాపాడుతూ గుహద్వారాన్ని కాపలాకాస్తుంది… ఎలుగుబంట్లలో తల్లికి తండ్రికి తమ బాధ్యత ఏంటో తెలుసు… వాటిని ఎలా నిర్వర్తించాలో తెలుసు… “నేను ఫెమినిష్టుని, లేదా నాకు స్త్రీహక్కు ఉంది, కాబట్టి నేనెందుకు పిల్లల్నికాపాడాలి… నీవే పిల్లల్ని కాపాడు నేను పోయివేట పట్టుకొస్తాను అంటూ ఎలుగుబంటి తల్లితడ్రులు తమలో తాము దెబ్బలాడుకోవు… తమ గుహలో తాము అశాంతిని కలుగజేసుకోవు… వాటికి ప్రకృతిపరంగా ఎదురయే ఇబ్బందులేతప్ప మానసికంగా ముఖ్యంగా హక్కులు బాధ్యతలవల్ల అశాంతి కలిగే ఆస్కారమేలేదు…. ఆలోచించండి.. నిజానికి మీరు ప్రకృతిని గమనించండి, ప్రతి జంతువూ తమ తమ పరిధుల్లో ప్రవర్తించడం మనకు స్పష్టంగా కనిపిస్తుంది.. వాటి ప్రవర్తనలో మనకు ఆత్మన్యూనత కనబడదు.. పైగా మనకు దాదాపుగా అన్ని జంతువులగురించి అవి ఎలా ప్రవర్తిస్తాయి, ఏం తింటాయి, ఎలా పడుకుంటాయి ఇటువంటి వివరాలన్నీ మనకు తెలుసు.

కానీ సత్యం ఏంటంటే మనకు మానవ-జంతువుయొక్క నిజమైన ప్రవర్తన ఏంటి అనేదే మనకు తెలియదు!!… దురదృష్టం ఏంటంటే మనం మర్చిపోయాము. మానవుడు చేపలాగా ఈదగలడు, పులిలాగా వేటాడగలడు, నక్కలాగా జిత్తులమారిగా ప్రవర్తించగలడు , పాములాగా కాటేయగలడు, దుమ్ములగొండిలాగా క్రూరతప్రవర్తించగలడు…. మానవుడికి ఇవన్నీ తెలుసు…
… అన్నీ చేస్తాడు… కానీ ఇవన్నీ మిగిలిన జంతువులను అనుకరించే ప్రయత్నాలు మాత్రమే! వాటినుండి నేర్చుకున్నాడేగానీ మానవజంతువు తనయొక్క అసలైన ప్రవర్తన ఏంటి అనేది మర్చిపోయాడు. మానవజంతుతల్లి సహజప్రవర్తన ఏంటి? మానవజంతుతండ్రి సహజమైన ప్రవర్తన ఏంటి? మానవజంతువులు సమూహంగా గడ్డిమేస్తూ ఉంటేవా లేక విడివిడిగా బ్రతికేవా? ఒకదాన్ని ఒకటి మీర్కట్ లలాగా ప్రేమించేవా లేక హైనాలలాగా ద్వేషించేవా? చీమలలాగా తేనెటీగలలాగా తమతమ ధర్మాలను పాటించేవా లేక కలహించేవా? మానవజంతువులు తమ నిజమైన మృగచేతస్సులో ఒకప్పుడు ఎలా ప్రవర్తిస్తూ ఉండేవి?! ఈ సమాచారం మనవద్ద లేదు… అదీ దురదృష్టం… ఇలా తన ప్రవర్తన మర్చిపోయినందువల్లే మనిషి ఆత్మన్యూనతకు లోనవుతాడు… తప్పొప్పులగురించి అవసరమైన దానికంటే ఎక్కువగా ఆలోచిస్తాడు… ఇందువల్లే మానవజంతువు అశాంతికి గురవుతున్నాడు… మానవజంతుతల్లి పిల్లలలను కంటుంది, పాలిచ్చి పోషిస్తుంది, ప్రేమిస్తుంది… దానివల్ల మానవజంతుతల్లి పొందేది ఏదీలేదు… అసలు ఆ స్వార్ధపూరితమైన ఆలోచన చేయడంగూడా అనవసరమే! కానీ ఈ మానవజంతుతల్లి అనేకమంది వ్యక్తులతో స్వేఛ్ఛగా రతిచేసి వారిలో ఐదుగురు విడి వ్యక్తులతో ఐదుగురు బిడ్డలను కని వాటిలోని ఒక బిడ్డను నిర్దాక్షిణ్యంగా కొట్టిచంపుతున్నప్పుడు తోటి మానవజంతువులు ఏంచేస్తాయి? చేతులుకాలినతర్వాత ఆకులుపట్టుకుంటున్నాయి… అసలు సమస్య అంతదూరం వెళ్లకుండా చూడాల్సిన తోటి జంతువులు తమ జంతుధర్మాన్ని మర్చిపోతున్నాయి. దర్మప్రబోధములను నీతులను పక్కనబెట్టి మానవహక్కులగురించి వక్రభాష్యాలు చేస్తున్నాయి.. హక్కులనుగూర్చి చెప్పే ముందు బాధ్యత అంటే ’జంతుపరంగా’ ఏంటో మర్చిపోయాయి… . దీన్నే నేను దురదృష్టం అంటున్నాను… బహుశా ఈ సృష్టిలో మానవజంతువులంత దారితప్పి తమను తాము మర్చిపోయిన జంతుసమూహం ఇంకొకటి లేదేమో!…. -మాధవ తురుమెళ్ల