Once upon a time there was a lake.  A lot of crocodiles were living around the lake.  They used to eat the fish in the lake and live happily.  But their habitat is invaded by Human pests.  Human pests started taking away their fish starving them to death!  So they started praying to their Sky God asking Him to show a miracle and drop some food in the lake.  Their GOD listened to them… Lo… Food dropped from sky 😉 – A small story by Madhava Turumella

ఒక చిన్నకధ:  అనగనగా ఒక చెరువు  ఆ చెరువులో బోల్డన్ని చేపలుండేవి.  ఆ చెరువుని ఆశ్రయించుకుని బోల్డన్ని మొసళ్లుగూడ ఉండేవి.  ఆ చెరువులో సమృద్ధిగా దొరికే చేపలని తిని హాయిగా బ్రతుకు వెళ్లదీస్తూ ఉండేవి… అలా ఉండగా ఈ మొసళ్లు ఉండే చోటికి మనుష్యపురుగులు (మొసళ్ల లెక్కలో) వచ్చి చేరాయి.  ఆ మొసళ్ల ఆహారమైన చేపలన్నింటినీ ఈ మనుష్యపురుగులు తినెయ్యడం మొదలుపెట్టాయి.  దాంతో మొసళ్లకు ఆహారం దొరక్కుండా పోయింది… అవి చాలా బాధపడుతూ చెరువుచుట్టూచేరి భక్తికా వాళ్ల  వానదేవుడికి మెరపెట్టుకున్నాయి. “దేవుడా దేవుడా… ఈ మనుష్యపురుగులవల్ల మాకు తిండిలేకుండాపోతోంది… ఆకలితో చచ్చిపోయేలాఉన్నాము… నువ్వు మాపై జాలితలిచి మాకు ఆకాశంనుండి కొంచెం తిండి మా చెరువులో పారేస్తే నీ పేరు చెప్పి మేం పండగచేసుకుంటాం” అని మొరపెట్టుకున్నాయి… అంతే ఆకాశంలో మెరుపులు మెరిశాయి, ఉరుములు ఉరిమాయి, గాలి భయంకరంగా వీచింది… మేఘాలు తెరుచుకున్నాయి… మొసళ్ల మొరను ఆలకించిన దేవుడు ఆకాశంలోనుండి వాళ్లకోసం చెరువులో ఆహారాన్ని పడేశాడు అంతే ’మొసళ్లు పండగ’ చేసుకున్నాయి… – మాధవ తురుమెళ్ల